Friday, June 17, 2011

Day 165 - June 14 - Kobbari Mattalu


If you closely observe there is a man on the tree cutting off the branches and the coconuts..

వానా కాలం మొదలు అయ్యింది ఈదురు గాలులు విపరీతంగా వచ్చేస్తున్నాయ్, దూరంగా దొడ్లో కొబ్బరి చెట్లు పెట్టుకోడంలో అర్ధం ఉంది కాని ఇలా ఇంట్లో ఆనుకునేటట్లు వేసుకోడం ఏంటో  ఇంట్లో కొబ్బరి మట్టలు, పిందెలు కాయలు, గాలికి, ఎండిపోయి, ఎప్పుడు గుండు మీద పడిపోతాయో తెలియక బిక్కు బిక్కు మని ఉండాలి.  ఇల్లంతా కలతిరిగే చిచ్కూ గాడితో ఇంకొంచెం భయం ఇవుంటే... పోయినేడాది నా మానాన నేను ఏదో laptop మీద పని చేసుకుంటే ఇంట్లో పడి పైకి లేచి నా నడుం మీద గాట్టిగా తగిలింది.. కింద పడి పైకి లేచింది కాబట్టి సరిపోయింది కాని డైరెక్టుగా  పడుంటే నా పని ఖాయం అయిపోయేది... అది గుర్తొచ్చి ఈ ఏడు ఎలాగోలా కళ్ళు గీసేవాల్లని బతిమాలి బామాలి బోల్డు డబ్బులు పోసి, మట్టలు కూడా ఇచ్చేసి కొట్టిన్చేసా.. ఇప్పుడు ప్రాణానికి హాయిగా ఉంది కాకపొతే చెట్టు మీద పెట్టిన కాకి గూళ్ళు , కొంగ గూళ్ళు కూడా పడిపోయాయి.. ఊరోచ్చాక ఇలాంటి సున్నితమైనవి చాల పట్టించుకోడం మానేసాను.. కొన్ని తప్పవు, గాలికి మాటలు పడ్డా ఆ గూళ్ళు పడిపోవడమో, లేకపోతె రోజుకొకటి కాకులు గుడ్ల కోసం పడెయ్యటమో చేస్తూనే ఉన్నాయి... అక్కడికీ అందినవి కొన్ని తీసి మొవ్వలో పెట్టించాను కాని కొన్ని పడిపోయి.. గవర్నమెంటు తుమ్మ ముళ్ళు, చీపిరి పుల్లలు, ఈనాలు అన్ని కలిపి చాల కష్టపడి కట్టుకున్నాయి.. అదేనేమో జీవితం అంటే ఆ పిట్టలకి సర్వస్వం ఆ గూడు అది మనిషి అవసరాలకి బలి.

after clearing the branches, now we are safe for the next 6 months at least.  It has been a mess for a while with all the people on the road, the household help and every one complaining that they might fall on their head.

3 comments:

  1. ఒక ఉచితసలహా...నచ్చకపోతే తిట్టుకోకండి.

    మీ ఫోటోలు జీవితంలోని పలుకోణాలను చూపుతున్నట్లున్నాయి. అయితే లేబుల్స్(tags) ఇంకా కొద్దిగా ఆలోచించి పెడితే, ఆ ఫోటోలు, గూగుల్ ద్వారా search చేసే వారెవరికైనా ఉపయోగపడొచ్చు, బ్లాగ్ వ్యూయర్ షిప్ కూడా పెరగొచ్చు కదా. ఉదా.కి ఇవాళ్టి ఫోటోకు coconut tree, branches of coconut tree అని tags ఇవ్వడం.

    ReplyDelete
  2. thank you for the suggestion, but this blog is for my personal pleasure Teja, viewership is not the criteria, konni telugu blog linkski adi elaa cherindo, cherchaaro teliyadu, so I get a little traffic from there.

    Labels konchem cleargaa pettaali anukuntunna nenu kooda time choosukuni cheyyaali...

    ReplyDelete
  3. Yes, I know that you are doing this, not for viewership. కానీ, నా మెయిన్ పాయింటేమిటంటే, ఒక్కోసారి ఒక పర్టిక్యులర్ ఫోటోకోసం గూగుల్ లో వెతుకుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు మీ ఫోటోలు ఉపయోగపడొచ్చుకదా అని.

    ReplyDelete