Sunday, February 27, 2011

February 27 - Medical Camp

A free medical camp in the village...

There was a good turn out, the area was spacious, the doctors in the camp were good at their job and yes, this was certainly of benefit.

ఊర్లో ఒక మెడికల్ క్యాంపు పెట్టారు అని తెలిసి నేను చిచ్కూ ఒక లుక్కు వేసి వచ్చాం.. మామూలుగా ఏదో మొక్కుబడి కోసం డాక్టరు వస్తాడు, వాళ్లకి అలా చెయ్యాలి అని ఒక రూలు ఉంది కాబట్టి వస్తారు, చూస్తారు వెళ్తారు అంతే కాని పెద్ద ఉపయోగం లేదు అనుకుంటూ వెళ్ళని వాళ్ళు చాల మంది ఉన్నారు.. పేద వారి కోసం పెట్టిన ఈ క్యాంపుకి వాళ్ళు మాత్రం రాలేదు, కాని ప్రతి చదువుకున్న వ్యక్తీ మాత్రం దాన్ని ఉపయోగించుకున్నాడు.. నేను, చిచ్కూ, పిల్ల గ్యాంగ్, ఊర్లో పెద్దవాళ్ళు అందరం వెళ్లాం, కాని ఎవరి కోసం ఐతే చేసారు అందులో చాల తక్కువ శాతం మంది వెళ్ళారు అది సరి అయిన అవగాహన లేకపోవడం అనేది నాకు అర్థం అయిన విషయం.

February 26 - Sattu ginnelaki maatlu, repairlu..

A lady repairing the old kerosene stove and some used utensils...

మాట్లేస్తాం గిన్నేలకి మాట్లేస్తాం, కేరోసిన్ పొయ్యిలు బాగు చేస్తాం అంటూ రాగంలాగా పాడుకుంటూ ఊరంతా తిరిగి చెప్పి ఎక్కడో ఒక చోట కూర్చుని పోగేసుకోచ్చిన వాటిని ఒక్కొకటే బాగు చేసి మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్లి ఇచ్చేసి రావడం అనేది రెండు వారాలకి ఒకసారి మా ఊర్లో జరిగే విషయమే.. కాని సామాన్యంగా ఈ మాట్లు మగవారు వేస్తె ఆడవారు ఇంటింటికి తిరిగి వెళ్తారు.. ఈ సారి మాత్రం కొత్త వారు వచ్చారు.. ఎంతో అమాయకంగా నవ్వుతున్న ఈ అమ్మాయికి మాటలు రావు, మండుటెండలో ఇలా కష్టపడి పొట్ట పోసుకోడం తప్ప.. ఎందుకో ఏదో మూల కలుక్కుమంది గుండెలో నాకు.

Friday, February 25, 2011

February 25 - Highschoolki 44 Ellu

Felicitating Yerneni Vasudevarao garu, a village elder who takes part in its development and a motivation for many.

ఎందఱో ఎన్నో చెప్తారు, ఎన్నో అనుకుంటారు కాని వాటిని ఆచరణలో పెట్టేది చాల తక్కువ మంది.. ఎలాంటి ప్రతిఫల అపేక్ష లేకుండా తను పుట్టిన ఊరికి తన వంతు సాయం చెయ్యాలి అని కొంతమందికి ఉంటుంది దాన్ని కార్యాచరణలో పెట్టె అతి కొద్ది మందిలో వాసుదేవ రావు తాతగారు కూడా ఒకరు.  ఏదో చేసెయ్యాలి అని చించేసి పొడిచేసి ఆలోచిన్చేసి  అసలు ఏమి చెయ్యలేని నా లాంటి వాళ్లకి ఒక కనువిప్పు.. మంచి చెయ్యాలి అంటే అవకాసం మనని ఎత్తుక్కుంటా రాదు, మనమే ముందుండాలి చేసి చూపించేవారు.  తను ఒక retired professor, HOD. తనకి చేతనైనంత సాయం చెయ్యటంలో ఎప్పుడు ముందుంటారు.  గ్రామా అభివృద్ధి కమిటీ అని ఒకటి పెట్టి ఎన్నో మంచి పనులకి విరాళాలిచ్చి ఇంకా ఏంటో చెయ్యాలి అని అనుకునే దాత.  నేను ఎక్కువగా కలిసి ఎంతో నేర్చుకోవలసిన వ్యక్తీ.

Yaasi Bhayya gets a prize for sports (throwball) and no surprises, it was given to Chichkoo promptly for which she responded with a beaming smile and a good job and a happy to you all at the same time.. kids!!!! they teach you so much without the BIG lectures, just gestures.

నిన్న స్కూల్ వార్షికోత్సవానికి నేను చిచ్కూ వెళ్ళాం.. ఏదో ఇవ్వటానికి వెళ్లి ఎంతో నేర్చుకుని వెంట తెచ్చుకున్నాం.

Thursday, February 24, 2011

February 24 - Ramana Gaaru Inka Evariki Andani Kammanu Pattukuni Vellipoyaaru..


I have not seen anyone express extreme hunger and his trysts with in such a manner to bring a laughter on the reader's lips.

ఆకలి గురించి దాని బాధ గురించి ఇంత నవ్వులాటగా చెప్పిన మనిషి ఇంకొకరు ఉండరేమో.. మొదలు పెట్టినప్పటినించి చివరి పేజీ దాక అలా చదివేయ్యలనిపిస్తుంది.. జీవితం ఒక తమాషా అని నిలువు ప్రతీక ఈ ఆటోబయోగ్రఫీ అనిపిస్తుంది.

 The latest and the last of his writings to my library :(.

బాపు బొమ్మ అంటే పుస్తకంలో ఉన్న విషయం అంతా అందులోనే కనిపించేస్తుంది అంటారు అది ఎంత నిజం... ఈ రెండు కోతుల తోకలు ఏది మొదలు ఏది అంతం అని తెలియట్లేదు కదూ.  డెన్నిస్ ని కాపీ కొట్టినా బుడుగు ని మించిన వాడా చెప్పండి?

Perhaps the current state of Bapu would be similar to the shadow with a gaping hole near the heart...!!

ఎవరైనా పొతే అయ్యో కుటుంబ సభ్యులు ఎంత దుఖంలో ఉన్నారో అని మనం అనుకుంటాం కాని రమణ గారు ఇక లేరు అంటే ఇక బాపు గారు ఒంటరి అని ఎంతో మందికి అనిపించి ఉండొచ్చు అంటే వీరి స్నేహం , బంధం అనుబంధం ఎంతటిదో తెలుస్తుంది... ఇప్పుడు బాపుగారు బొమ్మ వెయ్యాలి అంటే తన నీడకి గుండె దెగ్గర ఖాళీ ఉంటుందేమో కదూ..


The last 2 entries were made by me yesterday while re-starting his (In)Kothi-Kommacchi..

పొద్దున్నే లేచి కేవలం ప్రసాంతమైన వాతావరణంలో ప్రశాంతం అయిన పనులు మాటలు మాత్రమె వినాలి అనే నా రూలు ప్రకారం టీవీ చూడటం మానేసాను కాని బ్లాగ్లో updates ఉంటాయి అని మర్చిపోయి చూస్తె తెలిసిన కబురు.. చాల బాధగా నా రోజు మోదోలయ్యింది.. నిన్నే రాసుకున్న ఒక మనిషి ఇంకా లేరు అంటే ఇంకొంచెం ఎక్కువ బాధ వేసింది... నా లాంటి ఎందఱో అభిమానులకి ఇది ఒక తీరని లోటు మిగిల్చిన రోజు..

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు పోయిన ఇదే తారీఖున  ఈయన కూడా అస్తమించడం తెలుగు సాహిత్యానికి ఈ రోజుని బ్లాక్ డే గా మిగులుస్తుందేమో.

Tuesday, February 22, 2011

February 23 - Vaakitlo Cheeralu

The young saree seller from Kolkatta..

చూసిన పాముని బొక్కన పోనియ్యారు అని మా తాతయ్య ఎప్పుడు అనే మాట నాకు మా అమ్మని కూతురుని చూసినప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది.. ఇద్దరు కలిసి రోడ్ మీద ఎవరైనా ఏదైనా అమ్మేవాళ్ళు కేక వినపడితే చాలు కేకలేసి పిలిచి కాసేపు టైం పాస్ చేసి అది ఏమైనా సరే, , అవసరం ఉన్న లేకపోయినా కొనేస్తారు..ఒకప్పుడు కేవలం మా అమ్మ మాత్రం చేసేది, పాపం ఇంకో మనిషి లేక తను కూడా అలా చేస్తుంది లే అని నేను సర్ది చెప్పెసుకుంటే ఈ మధ్య మా అమ్మ పనిలో ఎక్కడో ఉండి కేక వినకపోయినా చిచ్కూ కేకేసి ఆవిడని పిలిస్తుంది.. ఇద్దరు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గేటు దెగ్గరకి పరుగులు... హతవిధీ!!!! 

Monday, February 21, 2011

February 22 - Lovely Flowers

A gift from Chichkoo's Paunanna..  Looking at them for the first time any idea of the name?

చిచ్కూ ఫ్రెండ్ గ్యాంగ్ అంతా భలే మంచి bonding ఉంటుంది.. ఎక్కడ ఏది కనిపించిన ముందు తినకోసం పట్టుకొచ్చి ఇస్తారు... తిను కూడా ఏది పెట్టిన వాళ్ళ వాటా అడిగి తీసుకుంటుంది.. యాసినాకి, గుండు భయ్యా కి, గాగుకి, అమ్మాకి, బుజ్జి కి  అని.. 

ఈ పేరు తెలియని పూలు మటుకు నాకు భలే నచ్చాయి వాసన కూడా బాగుంది...

PS:  విద్య అని ఒక ఫ్రెండ్ చెప్పింది దీన్ని పాండవ కౌరవ పూలు అంటారు అని.. దాని వెనక తన లాజిక్ కూడా చెప్పింది, నాకు చాల నచ్చింది కూడా, నిజమేమో కూడా ఈసారి రేకులు లెక్కపెట్టాలి.. వంద సన్న రేకులు, ఐదు మధ్య రేఖలు ఉన్న మూలాన ఈ పేరు అని.. 

Sunday, February 20, 2011

February 21 - The Little Gardener

The tiny gardener takes care of her plants... early morning bliss.

జ్వరానికి వేలాడిపోయిన చిచ్కూ నిదానంగా పుంజుకుని మళ్ళీ తన ఆటల్లో తను పడిపోతే ఎంతో ఆనందంగా ఉంది.. పొద్దున్నే వచ్చే నును వెచ్చని సూర్యకిరణాలు, చుట్టూ పచ్చదనం.. ఆరోగ్యాన్ని మించి మరేది లేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది. 

February 20 - Story Time

Some book picks for the kid.. she surely wont understand a few of them yet but she sure likes my talking her to sleep :).

ఎన్నో పుస్తకాలు నేను కొన్నా సరే పండు తల్లికి నచ్చిన, తను మెచ్చిన పుస్తకాలు కొనడంలో ఉన్న ఆనందం వేరు... తను చింపకుండా కాపాడటం ఒక యజ్ఞం అనేది పక్కన పెడితే అందులో కధలు అనగనగన అంటూ చెప్తుంటే తను తిరిగి చెప్తుంటే అదొక మంచి అనుభూతి.

February 19 - High Temperatures

The past couple of days, have been a tough time for the kid with really high temperatures.  only kids can weather all this and yet smile through it all making us cry all the more..

ఒళ్ళు తెలియని జ్వరం, ఒళ్ళంతా కాలిపోతూ ఉన్నంత వేడి, తట్టుకోలేక మధ్య మధ్యలో ఏడ్చినా అంతలోనే ఏదో మాయ చేస్తే నవ్వడం.. అలా ఒళ్ల్లో అంటుకుని పోయి కూర్చుంటే అదొక వెలితి.. గల గల ఇంట్లో తిరిగే పిల్ల అలా వాలిపోయి నీరసంగా ఉంటె కడుపు తరుక్కుపోవడం అంటే ఏంటో అర్థం తెలుస్తుంది..  

February 18 - Pelli Pilupulu

A wedding in the village, feast to eyes right from the time of invitation...

పెళ్ళికి జనాలని పిలవడం అంటే ఒకరో ఇద్దరో వెళ్ళడం కాకుండా చక్కగా ముస్తాబు అయ్యి బోలెడంత మంది పడుచు పిల్లలు గల గల మంటూ మాట్లాడుకుంటూ, పట్టు లంగాలు, నగలు, పూలు, నవ్వులు భలేగా ఉండేది.. అది నా చిన్ననాటి జ్ఞాపకం.. ఇప్పుడు పడుచు పిల్లలు లేరు ఊర్లో,ఎప్పుడో ఎవరో వచ్చినా వాళ్లకి ఊర్లో ఉండేవాళ్ళు ఎవరు తెలియదు మేము ఎల్లను పొమ్మంటారు కాబట్టి ఇంకా నడి వయసు వారే వచ్చేస్తున్నారు... అది కూడా ఎవరో ఒకరో ఇద్దరో, ఈ మధ్యకాలంలో ఇంత మంది రావడం ఇదే, చాల సంబరం వేసింది నాకైతే మటుకు. ఇది కేవలం సగం బ్యాచ్ మాత్రమె, మాది సందు చివరి ఇల్లు కావడంతో మిగతా వాళ్ళు పక్క వీధిలో ఉన్న రెండు ఇళ్ళకి వెళ్తే, ఈళ్ళు ఇక్కడ అలసట తీర్చుకుంటున్నారు అన్నమాట.

Wednesday, February 16, 2011

February 17 - Jangama Devara

Jangam Devara, yet another childhood memory of mine...


జంగం దేవర అని పిలుస్తారు ఇతనిని... అప్పుడప్పుడు ఇలా వచ్చి వడ్లు డబ్బులు తీసుకుని ఇంటి ముందు సంఖం ఊది శుభం పలికి వెళ్ళిపోతారు.. పేరు వెంకటేశ్వర్ రావు, ఊరు సీతనపల్లి.. ఇలా పండగలకి, పంటలు చేతికొచ్చినప్పుడు, పనులు దొరికి జనాల దెగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి ఊరంతా తిరిగి భిక్ష తీసుకుని వెళ్తారు.

మా ఊర్లో కొన్ని కులాల వారు (వారిని సాతాను మతస్తులు అంటారు ఇక్కడ), చనిపోయాక, వారిని కూర్చోపెట్టి తీసుకుని వెళ్లి సమాధి చేస్తారు, అప్పుడు ఈ జంగమ దేవర వచ్చి సంఖం ఊదుతూ తీసుకుని వెళ్లి కార్యక్రమం అంతా జరిపిస్తారు.. ఈ మధ్య వీళ్ళు దొరకడం చాల కష్టం అయిపోతుంది.. అంతరించిపోతున్న పరంపరల్లో ఇది కూడా ఒకటేమో. 


He wanted both the photos on "bilogga" or whatever it is that I wanted to put it on :)... so, the second picture is per his request.. I really love these golden oldies!! 

February 16 - Forbidden Apple?

Among other things in my drawer is this apple peeping out.. hidden by the kid.. sigh.. what goes around comes around??


చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా ఇస్తే బలవంతంగా తినమని ఇలాగే దాచెయ్యడమో కనపడకుండా గిరాటు కొట్టేయ్యదమో చేసేదాన్ని... తను మామూలుగా ఐతే అక్కడో ఇక్కడో రెండు మూడు బొర్రిలు పెట్టి, ఇంక మిగతాది వదిలేసి  అమ్మ నువ్వు తిను, బలం వచ్చి అని ఇచ్చేస్తుంది.. మిగతాది నేను లాగించేస్తాను.. ఇవ్వాళ ఎందుకో భద్రంగా దాచేసింది.  తిన్నావా నానా అంటే.. సియా బేబీ  మొత్తం తినేసి అనింది అబ్బో అయ్యో అని గుండె ఆగినంత పని అయ్యింది నాకు, అక్కడికి అటు ఇటు వెతికి చూసా కనిపించలేదు... మల్లి ఏదో డౌటు వచ్చి చూస్తె కంప్యూటర్ డెస్క్ లో దాచి ఉంచింది...  నాకు కళ్ళ ముందు చక్రాలు గిర్రున తిరిగి నా చిన్నతనం కనిపించింది.. ఇంక ముందు ముందు ఎన్ని కనపడ బోతున్నాయో మరి.

Tuesday, February 15, 2011

February 15 - Potting Them Up

A big hunt for planting soil and finally planting them with the help of the kid.. we both had fun!

ఊరంతా తిరిగి పొలం గట్ల మీద నల్ల మట్టి తెచ్చుకుని ఎలాగైతేనేమి తెచ్చిన కుండీలు అన్ని నింపేసాము  నేను చిచ్కూ కలిసి.. ఇంక ఇవన్ని ఆవిడ బాధ్యత.. తనే రోజు నీళ్ళు పోసి పెంచుకోవాలి, ఆకులు పువ్వులు కొయ్యకూడదు :).. బుద్ధిగా తల ఊపేసారు మరి ఏమి చేస్తారు అనేది వేచి చూడాలి.

February 14 - A little more greenery

Got these pots and plants after a long time... got them as my Valentines Gift for the kid.

కార్డ్లు, చాక్లెట్లు, బొమ్మలు ఇవన్ని ఇచ్చినా తనకి అర్థం అయ్యే వయసు కాదు, ప్రేమకంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకు అని అందరి లాగే అనుకున్నా తన కోసం ఏదోకటి తెచ్చి పెట్టాలి అనిపిచింది... మన ముందు తరానికి ప్రకృతి పచ్చదనానికంటే పెద్ద బహుమతి ఇంకోటి లేదు అని అనిపిస్తుంది నాకు.. అందుకే ఈ బుల్లి కానుక..

February 13 - In One Corner

The yoga mat hidden in one corner... 

భలే గంతులేసుకుంటూ motivation వచ్చేస్తుంది అనుకుని ఈ mat కొన్న సుముహూర్తం ఏంటో కాని  ఒక్క రోజున వాడిన పాపాన పోలేదు.. పడటం బొయికలు ఇరగటం  మళ్లీ పడటం మళ్లీ ఇరగటం.. ఇప్పుడిప్పుడే నడుస్తున్న కాని దీని వైపు చూడాలంటె మళ్లీ భయం :).

February 12 - Budabukkala Vaallu

This is a traditional attire of a person who comes to seek alms one in a while going around the village.. Budabukkala Vaallu is what we call them.. Note the cloth with stars and Australia written on it.

అప్పుడప్పుడు ఇంటికి వస్తూ తమకొచ్చిన విద్యలేవో ప్రదర్శిస్తూ చేతులో ఏదో ఒక చిన్ని బుర్ర లాంటి దాన్ని మోగించుకుంటూ మా చిన్నప్పుడు ఎక్కువ గా కనిపిస్తూ ఉండేవాళ్ళు ఈ బుడబుక్కల వాళ్ళు.. ఇంకో పేరు ఏదైనా ఉందేమో కూడా తెలియదు.. వింతగా బట్టలు తొడుక్కుంటే మటుకు మా ఇంట్లో వాళ్ళు ఆ మాట అని ఎక్కిరించడం మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది.

Friday, February 11, 2011

February 11- Down The Memory Lane

The front page of my personal journal, started in 2004 :).
మనసు లోపలి పొరల్లోని ఆలోచనలని రాసుకోవడానికి, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు ఆ భావాలకి అక్షర రూపం ఇచ్చి ఒక నిర్ణయానికి రావడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది నాకు ఈ రాతలు.  చిన్నప్పుడు డైరీ రాసేదాన్ని తరవాత మానేసాను, మళ్ళీ ఏదైనా బాగా బాధ వేసినప్పుడు మాత్రం ఇందులో రాసేదాన్ని.. ఇన్నాళ్ళ తరవాత మళ్లీ తవ్వకాల్లో ఇది బయట పడింది.

February 10 - Proof Of Address

My POA card arrives finally, issued by the local post office a photo ID proof along with the address on it.. phew!! Finally.

ఎదురు చూడగా చూడగా వచ్చిన వోటరు కార్డులో అన్ని అచ్చు తప్పుల మూలాన అది ఓటు వెయ్యడానికి తప్ప ఎలాంటి ఇతర అప్లికేషను కోసం పనికిరాదు.. DOB కూడా తప్పు పడిపోయింది మరి :(.  పోస్ట్ ఆఫీసు వాళ్ళు ఇచ్చే POA మటుకు చాలా క్లియర్ గా సుబ్బరంగా నాకు పనికొచ్చే రకంగా ఉంది..  ఇంకో మహాదానందకరమైన విషయం ఏంటి అంటే మూడు ఏళ్ళ దాక ఇక్కడే ఉంటే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు.. హమ్మయ్య... 

February 9 - Mantrinchina Minumulu

One strong belief in the village that when we spot a snake in the home or premises, you tie one of these on your body.

ఇంట్లో పాము కనిపిస్తే ఇలా మినుములు మంత్రించి ఇంటి చుట్టూ జిమ్మించితే, తెల్ల గుడ్డ పీలికలో కొన్ని మినుములు మంత్రించి కట్టి ఇస్తారు.. అది మగవాళ్ళు, చిన్న పిల్లలు  ఐతే మొలతాడుకి, ఆడవాళ్ళు ఐతే మంగళ సూత్రలకో ఏదైనా గొలుసుకో కట్టుకుంటారు.   మా అమ్మ కి దొడ్లో పాము ఒకటి కనిపించింది అంత, చుట్టు పక్కల పాడు పడిన ఇల్లు ఒకటి ఉండటంతో అక్కడివాన్ని అప్పుడప్పుడు వాకింగ్ కి వచ్చి పోతున్నాయ్ ఈ మధ్య.. ఇంక దెబ్బకి ఇంట్లో అందరం ఇవి కట్టించుకున్నం.. అది పనిచేసిన చెయ్యకపోయినా పోయేదేమీ లేదు కొన్ని మినుములు తప్ప.. అదొక నమ్మకం అంతే.

PS:  I was wondering what does mantrinchina translate to in English any inputs??

Monday, February 7, 2011

February 8 - Nene.. Adi nene, idi nene :)

Adding to the tool basket

ఈ ఊర్లో, ఊర్లో అని ఏముంది లెండి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే మాట వినే నాధుడే లేడు, ఇంటి ముందు గచ్చు ఊడిపోతే ఆ కాస్త లెక్క సిమెంటు పెట్టటానికి ఎవరు దొరకరు, మేకులు కొట్టాలన్నా, చిన్న చిన్న కరెంటు పనులు చెయ్యాలన్నా, చిన్న చిన్న వడ్రంగి పనులు చేయాలన్న, అసలు పలికే మనుషులేరి.. అందుకే మనం ఇందుగలడు అందులేడు    టైపులో అన్ని ఒక్కోటే, అమర్చుకుంటూ వచ్చీ రానట్లు చేసుకుంటూ పని గడిపేసుకుంటూ ఉన్నాం  అన్నమాట. ఇక ఇంట్లో తాపీ మేస్త్రి, వడ్రంగి, కరెంటు వాడు అన్ని నేనే... అది నేనే , ఇది నేనే 

?????

CHECK HERE.


:).  Dilip showed it to me, which was shown to him by his friend...

Reactions..

First - Artham Kaaledu.
Second - Assalu emi artham kaaledu.
Third - Dileepni adigite papam tanaki kooda artham kaaledu.
Fourth - Asalu naaku aa blog pere artham kaaledu :).. daaniki kooda malli papam Dileepe explaination icchukovalsi vacchindi :).
Finally - Heehaa nenu kooda popular aipoyaanu annamata.. ani anukovaali mari, naa postni acchamgaa alaage bloglo post chesesukunnaru adi kooda ade roju ante mari alaage anukovaali...

Latest, had a wholehearted laugh.. in fact, am still laughing as I post it.

Sunday, February 6, 2011

February 7 - Manchu Kurise Velalo

This was at 7 a.m. just in front of the gate.. foggy!!

పొద్దున్నే మంచు చాలా దట్టంగా పట్టేసింది ఈ రోజు, గేటు బయట అసలు ఏమి కనిపించనంతగా.. ఇది 7 గంటలకి.. చిచ్కూ తొందరగా నిద్ర లేగవకూడదు అని దణ్ణం పెట్టుకునేది ఇలాంటి రోజులోన్నే... ఈ మంచులో ఆటలు పరుగులు పెడితే అదొక భయం మళ్లీ.

February 6 - A Dash of Green

I love this plant very much... love the green that creeps on the walls it is given support on

నాకు మనీ ప్లాంట్ అనబడే ఈ మొక్క అంటే చాలా ఇష్టం, ఏంటో చక్కగా పెద్దగా వెలుతురు ఉన్నా లేకపోయినా, ఎండా ఉన్నా లేకపోయినా, దేని మీద పాకిస్తే అక్కడ అల్లుకుపోతూ కంటికి పచ్చగా ఎంతో ప్రశాంతంగా  అనిపిస్తుంది... రెండేళ్ళ తరవాత మళ్లీ ఒక పిలక తెచ్చి పెట్టాను మొన్నామధ్య.. ఇప్పుడు దాన్ని పాకిస్తుంటే అదొక తృప్తి.

February 5 - Isnt She Cute?

A photo excerpt from Dr. Bhanumati Ramakrishna's Naalo Nenu..

భానుమతి గారి అత్తగారి కధల్లోని అత్తగారు నాకు భలే నచ్చేసిన పాత్ర.. అది చదువుతూ బాపు గారి బొమ్మలు చూస్తూ ఉంటే ఆహ, భలేగా ఉందసలు... అది చదివినాక ఆవిడ రాసిన నాలో నేను పుస్తకం చదివిన నాకు ఈ బొమ్మలో అత్తగారిని చూస్తె అసలు ఇంకా చాలా నచ్చేసారు..

PS:  I just fell in love with the expression on the Golden oldie's face... dont you too?

Feb 4/Day 35 - Peeping Chocs

Chocolates stuffed in all the imaginable and unimaginable places away from the kid's reach.. :(..

చిచ్కూ గాడి ఫ్యాన్ ఫోల్లోవింగ్ కి నా కష్టాలు ఒకటి రెండు కాదు.. వస్తూ వస్తూ వాళ్ళు తెచ్చే కాకిడీలు (చాక్లెట్లు) దాయలేక నా పాట్లు ఇన్ని అన్ని కావు.

Wednesday, February 2, 2011

Feb 3/Day 34 - Giving Words To Feelings

An excerpt from RGV's Naa Ishtam... 

మనం ఎన్నో విషయాలను అనుభూతి చెందుతాం కాని వాటికి అక్షర రూపం ఇవ్వడం, ఒక చోట పేర్చడం కొంత మందికే సాధ్యం అవుతుంది.. ఎన్నో చదువుతాం అందులో మనకి కావలసింది మాత్రం మనకి అన్వయించుకుని ముందుకు సాగడం కొంతమందికే చేతనవుతుంది.

Tuesday, February 1, 2011

Feb 2/Day 33 - Another set

The order re-shipped finally thanks to the Professional Couriers mess..

దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది, నేను బెడ్ రెస్టు లో ఉన్నప్పుడు ఆర్డర్ చేసిన పుస్తకాలు నేను మళ్లీ ఉద్యోగం మొదలు పెట్టినాక కుప్పలు తెప్పలుగా వస్తున్నాయ్.. ఈ దిక్కుమాలిన ప్రొఫెషనల్ కోరిఎర్ వాడు ఇలా చెయ్యడం ఇది రెండో సారి డెలివరీ లేని చోట్లకి అసలు ఆర్డర్ ఎందుకు తీసుకుంటారు అని అర్థం కాని ప్రశ్న..