Sunday, February 27, 2011

February 26 - Sattu ginnelaki maatlu, repairlu..

A lady repairing the old kerosene stove and some used utensils...

మాట్లేస్తాం గిన్నేలకి మాట్లేస్తాం, కేరోసిన్ పొయ్యిలు బాగు చేస్తాం అంటూ రాగంలాగా పాడుకుంటూ ఊరంతా తిరిగి చెప్పి ఎక్కడో ఒక చోట కూర్చుని పోగేసుకోచ్చిన వాటిని ఒక్కొకటే బాగు చేసి మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్లి ఇచ్చేసి రావడం అనేది రెండు వారాలకి ఒకసారి మా ఊర్లో జరిగే విషయమే.. కాని సామాన్యంగా ఈ మాట్లు మగవారు వేస్తె ఆడవారు ఇంటింటికి తిరిగి వెళ్తారు.. ఈ సారి మాత్రం కొత్త వారు వచ్చారు.. ఎంతో అమాయకంగా నవ్వుతున్న ఈ అమ్మాయికి మాటలు రావు, మండుటెండలో ఇలా కష్టపడి పొట్ట పోసుకోడం తప్ప.. ఎందుకో ఏదో మూల కలుక్కుమంది గుండెలో నాకు.

3 comments:

  1. అయ్యో పాపం. ఇంటింటికీ వెళ్లి తను చేసే పని గురించి ఎలా చెప్తుందో, ఎలా బేర మాడుతుందో .. :( మాటలు రాకపోయినా ఇలా కష్టపడుతున్నందుకు ఆమెను నిజంగా మెచ్చుకోవాల్సిందే.

    ReplyDelete
  2. papam ani kaadu kaani, oka lesson for us to take anipistundi Rajesh.. it is double hard for them to earn the living with the disability but still they are doing it with a smile.

    Tanaki oka sister anukuntaa even she cant talk, husband will do the money collecting but the work is done by the ladies, that guy slept the whole day.. and there was around 5-year-old girl child who was going around with the sister to collect and give back the stuff..

    ReplyDelete
  3. అవును శ్రీ! తాను చాలా కష్టపడుతోంది!! అన్నీ ఉండి చిన్నచిన్న కారణాలవల్ల మనం లైఫ్ ని లైట్ తీసుకుంటాం..కానీ ఈమెలాంటివారివల్ల ఒక్కొసారి మనకు దేవుడిచ్చిన లైఫ్ వాల్యు తెలుస్తుంది...ఇంకా వీళ్లని చూస్తే వీరి ఆత్మవిస్వాసానికీ జోహార్లు కొట్తాలనిపిస్తుంది :)

    ReplyDelete