Monday, July 11, 2011

Day 192 ~ July 11 - Toli Ekaadasi, Pelaala Pandaga

Freshly ground henna, popcorn powder with sugar is all that I remember of this Toli Ekadasi Day.. memories that live on and things that we do to remember them..

పేలాల పండగ అని మాత్రమే నాకు గుర్తుండే పండగ తొలి ఏకాదశి అమ్మమ్మ ఉన్నప్పుడు గోరింటాకు రుబ్బి, పేలాలు పిండి పట్టించి బలవంతాన తినిపించి, తను ఉపవాసం చేసి మమ్మల్ని గుడికి పంపించి చాలా హడావుడి చేసేది.. ఇప్పుడు తను లేదు, నాకు చేసే ఓపికా లేదు కాని పండు గాడి కోసం చాకలి రుక్మిణమ్మ ప్రేమగా తెచ్చిన గోరింటాకు తనకి కాస్త బలవంతాన పూసి నేను పెట్టుకుని నాలుగు పేలాలు నమిలి పండగ అయ్యింది అనిపించాం ఎలాగోలాగ.

2 comments:

  1. ఏంటో.. మీ ఫొటోస్ చూసిన ప్రతిసారీ మా ఊరు, నా చిన్నతనం గుర్తొస్తుంది. కోన్ తో గోరింటాకు పెట్టే డిజైన్లే ఎక్కువైన ఈ రోజుల్లో, ఇలా ముద్దగా పెట్టుకున్న గోరింటాకు చూస్తుంటే నా చిన్నతనం లో, అమ్మ గోరింటాకు కోసి, రుబ్బి పెట్టుకున్న రోజులు, నాకు పెట్టిన రోజులు గుర్తొచ్చాయి. నేను అబ్బాయిని అయినప్పటికీ, ఇంట్లో ఆడపిల్లలలు లేకపోవటమో, అమ్మకు అదో ముచ్చట నాకు గోరింటాకు పెట్టటం. నాక్కూడా ఇష్ఠం అలా చల్లగా చేతికి తగులుతో పెట్టించుకోవటం. రాత్రి పెట్టించుకుని అలానే నిద్రపోయి, ఉదయాన్నే ఎండిన గోరింటాకు సంగం చేతి మీద, సగం పక్క మీద ! :) చేతులు కడిగిన తరువాత ఆ గోరింటాకు వాసన భలే గమ్మత్తుగా ఉండేది. Love those days ! Thank you for bringing those memories back to me.

    పేలాలు కూడా నాకు చాలా ఇష్ఠం. పేలాలతో పిండి చేస్తారు కదా, అది మరీ ఇష్ఠం.

    :)

    ReplyDelete
  2. nice post :-)
    sweet memories...

    ReplyDelete