Tuesday, June 26, 2012

Wk27/Dy4(179) ~ June 27 ~ న - నవ్వారు మంచం (Na - Navvaaru Mancham)

A cot being woven with cotton bands.

నవ్వారు మంచాలు ఈ మధ్య డబల్ కాట్స్ వచ్చినాక కనిపించట్లేదు కాని ఊర్లో ఎంత మంది వచ్చినా పడుకోవటానికి ఇబ్బంది లేకుండా మడత మంచాలు, నవ్వారు మంచాలు గోడవారన నుంచోబెట్టి ఉంచేవాళ్ళు.. నేను కూడా ఈ మధ్య మంచానికి నవ్వారు అల్లడం నేర్చుకున్నాను.

న - నవ్వారు మంచం

మంచం కోసం Check Here.

Monday, June 25, 2012

Wk27/Dy3(178) ~ June 26 ~ ధ - ధాన్యం బస్తాలు (Dhaanyam Bastaalu)

The paddy bagged and ready to go to the mill.

పంట చేతికోచ్చినాక ధాన్యం బస్తాలు కాటా వేయించి  వానకి తడవకుండా భద్రం చెయ్యటం ఒక పని...  అలా దాచిన ధాన్యం బస్తాలు

Wk27/Dy2(177) ~ June 25 ~ ద + ఒ = దొ - దొండ పందిరి (Dha + O = Dho - Dhonda Pandiri)


మా ఇంటి దేగ్గరి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోని దొండ పందిరి.. ఎంచక్కా కూర వండుకునే ముందు కాయలు కోసుకుని వండుకుంటే ఉంటుందీ.. అసలు ఈ రోజుల్లో ఆవిడ ఓపికకి నిజంగా దణ్ణం పెట్టవచ్చు అసల.

Wk27/Dy1(176) ~ June 24 ~ థ - రధము (Thha - Rathamu)



నాకు ఇక్కడ ఒక కుళ్ళు డౌటు వచ్చింది.. పండు గాడి పుస్తకంలో  రధము అని ఉంది కాని దానికి వత్తు ధ  వాడతారా, ద శబ్దం కదా చేస్తాం అని... ఏంటో చదవేస్తే ఉన్న మతి పోయినట్లుంది నాకు.


అమరావతిలో దేవుడి రథం.. ఇంత  భారీ రధం నేను  సినిమాల్లో తప్ప నిజంగా చూడటం ఇదే  మొదటి సారి.

Wk26/Dy7(175) ~ June 23 ~ త - తమలపాకు మొక్క (tha - thamalapaaku mokka)

beetle leaf plant..

పల్లెటూర్లో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చేది మంచి గాలి, ఆహారం... ఎంచక్కా పెరట్లో కరివేపాకు, కూరలు, అప్పటికప్పుడు కోసుకునివండుకోవడంలో ఉన్న తృప్తి, రుచి కి వేరొకటి ఏది సాటి రాదు...

తమలపాకులు అంటే ఎప్పుడు కొనుక్కుని తినే ఆకులే కాని పెరట్లోవి గిల్లుకుని కిళ్ళీ కట్టుకునే ఆనందమే వేరు...

త - తమలపాకు మొక్క 

Wk26/Dy6(174) ~ June 22 ~ ణ - అణా పైసలు (Ana - Anaa Paisalu)

the  currency from  olden days

అణా పైసలు అంటే ఇలాగ ఉంటాయ్ అని పిల్లలకి చూపించుకోడానికి తప్ప ఈ రోజుల్లో అవి చెల్లుబాటులో లేవు.

Wk26/Dy5(173) ~ June 21 ~ ఢ - ఢమరుకం (Dah - Dahmarukam)

A kid's toy..

ఢమరుకము మోగ, హిమ సిఖరమూగా, నటరాజు నర్తించనీ  అని భాను ప్రియ అనుకుంటా ఏదో సినిమాలో డాన్సు చేస్తుంది.. ఢ  అనగానే నాకు అదే పాట  గుర్తొచ్చింది కాని అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు.. శివుడి ఫోటోలో చూస్తె ఇంచు మించు ఇలాగే  ఉంది అని ఇది పెట్టేస్తున్నా.

Wk26/Dy4(172) ~ June 20 ~ డ - డప్పు అబ్బాయి (Da - Dappu Abbaayi)


పని రోజుల్లో, ఇలా వేషాలు వేసుకుని దప్పులు వాయించుకుంటూ తిరిగి బియ్యం డబ్బులు తీసుకుని వెళ్తారు కొందరు ఊర్లలో.. అది వారి జీవనోపాధి. 


డ - డప్పు అబ్బాయి 

Wk26/Dy3(171) ~ June 19 ~ ఠ - ఠావు (Tah - Tahaavu)

page  from  a  book

మా తాతయ్య చిన్నప్పుడు ఏదైనా రాసుకోవాలి అంటే ఒక ఠావు  పట్టుకుని రండిరా అనేవాడు.. ఇప్పుడు మనం దాన్ని పేజి అంటాము.. నిజానికి మా తాత తప్ప ఆ మాట ఎవరు వాడగా నేను వినలేదు.. మళ్ళీ ఇన్నాళ్ళకి కీర్తి బ్లాగు లో చూసాను.

PS:  Per Ramesh garu, it is ara tahaavu (half from a double page).. I was not aware of it.. Thank you!!!

Wk26/Dy2(170) ~ June 18 ~ ట - టపాసులు (Ta - Tapaasulu )

Kids lighting crackers for Diwali..

దీపావళి వచ్చిందంటే టపాసుల మోత  మోగిపోతుంది ఊరు ఊరంతా... నాకు చిన్నప్పుడు బాగా ఇష్టం  ఉండేది కాని ఇప్పుడు కాల్చను, పర్యావరణం కాలుష్యం అని ఏదో ఆలోచిస్తూ... కాని టపాసుల ఆనందం అంటే బాల్యంలోనే ...

Sunday, June 24, 2012

Wk26/Dy1(169) ~ June 17 - ఞ్ - జ్ఞాపకాలు (ini - Gnaapakaalu)

a  childhood  memory...

చిన్నప్పటి జ్ఞాపకాలు మదిని గిలిగింతలు పెడతాయి గుర్తొచ్చినప్పుడల్లా... ఈ పూల పుప్పొడి తోటి పున్జులాట ఆడేవాళ్ళం చిన్నప్పుడు రెండు తీసుకుని దేని తల ముందు ఎగిరిపోతే అది ఓడిపోయినట్లు.... :).

Wk25/Dy7(168) ~ June 16 ~ ఝ - ఝషము (Jha - Jhashamu)

the  kid  plays  with  a  live  fish...

ఝషము అంటే చేప అని నాకు పండు గాడి తెలుగు పుస్తకం చూసే దాక తెలియదు.. మీకు తెలియకపోతే కొత్త విషయం నేర్పించినట్టే :).

పండు గాడికి చిన్నప్పుడు భయం తెలిసేది కాదు ఇప్పుడు దడుస్తుంది  ఒక్కో సారి... పక్కింటి వాళ్ళు వండుకోతానికి చేపలు తెచ్చుకున్నప్పుడల్లా ఇలా వాటిని నీటిలో పడేసి కాసేపు పండు గాడికి చూపించే వాళ్ళం చిన్నప్పుడు.

Wk25/Dy6(167) ~ June 15 ~ జ - జనుము గడ్డి (~Ja - Janumu Gaddi)

the second Jha in telugu alphabet..

ఇంటి మీద తాటాకులు కాకుండా ఈ జమ్ము లేదంటే జనుము గడ్డి కప్పుతారు.. రేకుల మీద ఎండల్లో చల్లగా ఉండటానికి కూడా కప్పుతారు.. మామూలుగా ఐతే చాల బారుగా లావుగా బలంగా ఉంటుంది గడ్డి, ఎండాకాలం వానలు పడక ముందు కోయిన్చేసి ఇల్లు కప్పించేస్తారు.. అలా కొట్టేయ్యగా ఇప్పుడిప్పుడే మొలుస్తున్న ఫోటో ఇది.. ఎండల్లో తీసుకోవాల్సింది బద్దకించాను :(.


Wk25/Dy5(166) ~ June 14 ~ జ - జడ (Ja - Jada)

Summer braid special.. this year I had been busy plaiting these girls :).

ఈ ఎండల్లో పండు గాడికి వాడి ఫ్రెండ్స్ కి జడలు వెయ్యడం వేయించడం  సరిపోయింది .. కాని ఆ ముచ్చటే వేరు... మల్లె పూల జడ ముత్యాల జడ పూసల జడ, కుప్పెల జడ అది ఇది అని :)... ఎంతైనా నట్టింట్లో ఆడపిల్ల చెంగు చెంగున తిరిగే కళ వేరు :).

Wk25/Dy4(165) ~ June 13 ~ ఛ - ఛత్రము (Chha - Chhatramu)

Umbrella protection in hot sun...

మండుటెండల్లో కూడా షికార్లు  నాకు నా కూతురికి అలవాటైన పనే.. టోపీ పెట్టి పై  గొడుగు పుచ్చుకుని తిరిగేవాళ్ళం తను చిన్నప్పుడు.. ఈ ఏడాది ఎండలకి మటుకు అడుగు బయట పెడితే ఒట్టు.. నాలుగు వడ దెబ్బలు గాట్టిగా తగిలాయి మరి ఇద్దరికీను..

Wk25/Dy3(164) ~ June 12 ~ చ - చాప (~Cha - Chaapa)


could  not  find this in  lekhini  also ....


on  a  mat  in  the  beach, reading  a  book watching  the  kid  play, sun , sea, sky.. heaven

ఇసకలో ఆడుకుంటూ మధ్య మధ్యన ఇలా చాప మీద కూర్చుని అలలని చూడటం భలే మజా గా ఉంటుంది నాకు.

Wk25/Dy2(163) ~ June 11 ~ చ - చల్ల కవ్వము (Cha - Challa Kavvam)

Churning butter milk.. 


పెరుగు చిలికి మజ్జిగ చేసి వెన్న తియ్యడానికి వాడే ఈ కవ్వం మా అమ్మమ్మ వాళ్ళ  కాలంలో చాల పెద్దది ఉండేది... దూలానికి కట్టి కింద ఒక పెద్ద కుండ పెట్టి అందులో మజ్జిగ చేసేవారు ఇప్పుడు ఈ బుల్లి బుల్లి కవ్వాల తోటి చెయ్యడమే చాల ఎక్కువ అనే పద్దతిలో పడిపోయాము


Wk25/Dy1(162) ~ June 10 ~ ఙ్ - (gna-kainkaryam)


అసలు ఙ్ అనే అక్షరాన్ని ఇలా ఉపయోగిస్తారు అని కూడా నాకు తెలియదు... ఎక్కడా చూడలేదు, ఇది కరెక్టో  కాదో కూడా తెలియదు.. నాకు దీంతో పదం కంప్యూటర్ లో రాయడం కూడా రాదు. కాని నేను చూసిన పదం మాత్రం ఇది.. అందుకే ఇందులో పొందు పరుస్తున్నా..

The first time I have seen the usage of work "gna" from telugu akshara maala.. (Archived pic )

Wk24/Dy7(161) ~ June 9 ~ ఘ - ఘట్టము (Gha - Ghattamu)

A  ritual  in  traditional  telugu  hindu  marriage..

కృష్ణా జిల్లా తెలుగింటి పెళ్ళిలో జరిగే ఒక ఘట్టం బావ మరిది కాళ్ళు కడగటం, మండపం దెగ్గరకి పెళ్లి కొడుకు వెళ్ళే ముందర పెళ్లి కూతురి అన్నో తమ్ముడో ఇలా కాళ్ళు కడిగి తీసుకెళ్లడం ఆనవాయితీ, అప్పుడు బావ గారు బట్టలు పెట్టి ఏదో చదివించడం కూడా ఆనవాయితీనే..

మా ఇంట్లో ఒక జోక్ ఏంటి అంటే కాళ్ళు కడిగితే, బట్టలు బంగారం పెడితే ఒకరోజు వచ్చి బావ గారి ఒళ్ళు అంతా  తోమి తోమి కడిగి వెళ్ళాలి అని ;).

ఘ - ఘట్టము 

Wk24/Dy6(160) ~ June 8 ~ గ + ఓ = గో - గోబర్ గ్యాస్ (Ga + O= Go - Gobar Gas)

The gas run  on  cow  dung.

ఊర్లో ఎక్కువ పాడి ఉంటే తప్పకుండా కనిపించేది ఈ గోబర్ గ్యాస్ పొయ్యిలు... పేడ  మీద పని చేసి ఈ పొయ్యి మీద తేలికగా పది మందికి వండి పెట్టొచ్చు... ఆ పక్కన కనిపించే సిమెంటు దాంట్లో పేడ  వేస్తె అది ఆ పక్కన ట్యాంక్ లోకి వెళ్లి గ్యాస్ గా మారి పనికి రాణి పేద పక్కన తొట్టిలోకి చేరుతుంది దాన్ని మొక్కలకి పాదుల్లో వేస్తె మంచి బలం అని వాడతారు లేదంటే పెంట పోగులో పోస్తారు.

Wk24/Dy5(159) ~ June 7 ~ ఖ ఖద్దరు ( Kha - Khaddaru)



పండు గాడిని పిచ్చి గారాబం చెయ్యడంలో, విపరీతమైన రౌడీతనం నేర్పడంలో ముందుండే మా బుడ్డ మామయ్యా ఇప్పుడు మాకు లేడు... కాని ఆ ఖద్దరు చొక్కా జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మాసిపోవు...

ఎంత డబ్బు పోసి కొన్నా తెల్లటి ఖద్దరు గుడ్డని మించి హాయిని ఇంకోటి ఇవ్వదు..

Miss  you  maamu...

ఖ ఖద్దరు 

Wk24/Dy4(158) ~ June 6 ~ క - కల్లు ముంతలు (Ka - Kallu Muntalu)

The toddy pots...

పొద్దున్నా సాయంత్రం రోజు నాకు కనిపించే దృశ్యం ఈ కల్లు  గీత... తాడి చెట్లకి ఈ ముంతలు కట్టి మరుసటి రోజు వెళ్లి దింపి తెచ్చుకుని ఒక్కోసారి అక్కడే కల్లు  అమ్మేసి రావడం ఒక్కోసారి ఇంటి దెగ్గర అమ్ముకోవడం.  పనికి బయలు దేరే ముందు చాల మంది ఒక గ్లాసుడు కళ్ళు కొనుక్కుని తాగి వెళ్ళడం, లేదంటే సాయంత్రం అలా ఊరి చివర తాడి చెట్ల దెగ్గర బీడీ చుట్టా కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తాగటం ఇంచు మించు ప్రతి రోజు కనిపిస్తుంది.

క - కల్లు  ముంతలు 

Saturday, June 9, 2012

Wk24/Dy3(157) ~ June 5 - Acchulu Ayipoyayoch

Done with Telugu vowels and combined letters...!

ఈ ఫోటో  పోస్టుల పుణ్యమా అని  తెలుగు భాష గురించి  విషయాలని బోల్డన్ని నెమరు వేసుకుంటున్నా నేను మాత్రం.. వాడుకలో ఉన్న అచ్చులు, సంయుక్తాక్షరాలు అన్ని అయిపోయాచ్... ఈ అర సున్నా పోస్టు నా వాళ్ళ కాదు కాని ఆడుతూ పాడుతూ హల్లులు కూడా కానిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. :).

Ara Sunna toti words ante nenika padyaalu etiki pattukuraavaalemo... so ara sunnaa vadilesi acchulu, ubhyaaksharaalaki mangalam paadestunna :).

Wk24/Dy2(156) ~ June 4 ~ అః - అంతఃపురం (Aha - Antahpuram)


Our palace... Yes, it indeed is.. In these days, managing it is like a white elephant and for me affording such big place can become reality only in a village.

మధ్యలో ఉండే మూడు గదుల ఇల్లు, పైన రెండు గదులు, ఆ పైన డాబా, కింద వైపు పక్కగా వంట ఇల్లు, ఆ పక్కన భోజనాలకి చుట్టిల్లు, వెనకగా బాత్రూమ్లు.. వాటికి అటు పక్కన  బియ్యం కొట్లు, ముందు వసారా, వాకిలి, అటు పక్కగా నుయ్యి, అంట్లు బట్టలు కడుక్కుని ఉతుక్కునే గట్టు గేటు బయట ఖాళీ స్థలం... వెరిసి  ఇదంతా మా సామ్రాజ్యం, పాచి ఊడ్చి శుభ్రం చేసేపాటికి నడుము పడిపో, ఏదో నలుగురు ఉండబట్టి సాగిపోతుంది కాని లేకపోతె ఒక్క రోజు ఇదంతా ఊడ్చి సుబ్రం చేస్తే నేను నాలుగు రోజులు లేగా... అందుకే చూడటానికి ఇది బుజ్జి ఇల్లయినా కూడా నాకు మాత్రం ఇది ఒక అన్తఃపురమే.. వారంలో ఒక రోజు బూజులు దులపకపోతే అరుంధతి ఇల్లు కూడా అనేయోచ్చు :).

Wk24/Dy1(155) ~ June 3 - అం - అందెలు (Am- Andelu)

Learning Kuchipudi dance...

బుజ్జి బుజ్జి పాదాలకి పట్టీలు పెట్టుకుని ఘల్లు ఘల్లు మంటూ నడుస్తుంటే  నాకు భలే ముచ్చటేస్తుంది పండు గాడిని చూసి.. అప్పుడెప్పుడో తను ఇంట్లో కూచిపూడి నేర్చుకునేటప్పుడు గురువు గారు గజ్జే  చేసి ఈ అందెలు కట్టారు... ఇప్పుడంటే ఆయనని భరించే స్తోమత లేక బళ్ళో నేర్పించేస్తున్నాను కాని తను దిత్తోం దిత్తోం అనుకుంటూ ఇల్లంతా తిరుగుతూ గంతులేస్తుంటే.... నేను స్వర్ణకమలంలో వెంకటేష్ లాగ అందెల  రవళిది  పదములదా అనుకుంటూ మురిసిపోయే దాన్ని.


Wk23/Dy7(154) ~ June 2 ~ ఔ - ఔషధ విలువలు (Ou- Oushadha Viluvalu)

Neem, tulasi and aloe..

చక్కగా వేప చెట్టు గాలి పీల్చుకుంటూ పందుం పుల్ల తోటి పళ్ళు తోముకుని కొంత వేప చిగురు తినేసి ఆ పిమ్మట కాస్త తులసాకులు నమిలితే అసలు ఏ రోగాలు దెగ్గరకి రావు అని మా తాతయ్య చిన్నప్పుడు మాతోటి తినిపించేవాడు ... ఇప్పుడు అన్నీ ఉన్నా కాని ఒంటి నిండా బద్ధకం కూడా ఉండి  ఏమి చెయ్యట్లేదు.

మొఖానికి కాస్తంత కలబంద గుజ్జు రాసుకుంటూ మచ్చలు పడవు అని కూడా అం, అన్నీ ఇంట్లో ఉండి  వీటిని ఉపయోగించుకున్న వాళ్ళు ధన్యులు సుమతీ అని నా మాట.

Wk23/Dy6(153) ~ June 1 ~ ఓ - ఓకులు (Oa - Oakulu)

The 13-card game show

ఊర్లో మందు కొట్టుతోటి సమానంగా కొంపలు కూల్చేసే వ్యసనం ఈ పేకాట... మా తాతీ  కూడా విపరీతంగా ఆడేవాడు, ఆస్తులు తగలేసుకున్నాడు కూడా... అది తప్పు అని తెలిసినా కూడా మారలేరు.  మా అమ్మమ్మకి విసుగొచ్చి ఆఖరికి నువ్వు పోయాక కూడా నిన్ను ఈ పేక ముక్కలతోటి తగ్గలేట్టకపోతే సాంతం తగలడవు అని తిట్టి పెట్టేది.. అయినా సరే నవ్వి తన దారి తనదే... ప్చ్చ్ ...

మేము చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు ఈ పేక  చూస్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం... పాయింట్లు వేసుకుని ఆడేవాళ్ళం... ఎవరికీ ముందు 150 ఓకులు   వాళ్ళు ఓడిపోయినట్టు..గెలిచిన వాళ్లకి ఆ పందెం డబ్బులు/వస్తువు ఇచ్చేసేటట్లు..

Wk23/Dy5(152) ~ May 31 ~ ఒ - ఒప్పుల కుప్ప (O- Oppula Kuppa)

beautiful girls playing a traditional game - oppula kuppa

ఒప్పుల కుప్ప వయ్యారి భామ అంటూ ఆడపిల్లలు నట్టింట్లో ఆడుతూ ఉంటె ఆ ముచ్చటే వేరు.

Tuesday, June 5, 2012

A Teeny Tiny Break

Had been busy with some kids in the village, they had come for summer vacation and since Sreya wanted to play with them and the summer heat was too much to be ignored to let them play around, I got them all to my place... ante, they go to their place only for food and bathing.. sleeping, playing antaa ikkade... but they had a blast... The kid had her first sleepover buddies and made a mess.. Nagu nadumuki, naa chevuluki pattinaa tuppantaa vadilinchesaaru... aunteeeeeeeeeeeeeeeee idi, aunteeeeeeeeeeeee adi.. ani, illaite kishkinda kaanda roju, but glad we had them over, Sreya had a blast and so did I.. :).

God, it is a mess when they play and leave things as is!!!!!!  Hats off to Nursery and KG teachers... so life alaa aa pillalatoti moodu edupulu, aaru arupulu.. goggolu gandaragolam veetannitiki todu naa dikkumaalina eye infection toti, sarigaa pictures teeyaleka, teesinavi post cheyyaleka, am taking a break for a while... okesaari bumper offer laaga post chestaa :)...

Keerthi, keep them coming... nenu middle drop kaadu kaani... will catch up at a slower pace...