Friday, June 3, 2011

Day 154 ~ June 3 - Kotta Kodali Saare

The neighbor's new daughter-in-law came home for the first time and we get these goodies.. :)..a gang of ladies go to each doorstep and the householder has to bring her own plate to get it filled with the goodies.

మాకు పాలు పోసే వాళ్ళ చుట్టాల ఇంటికి కొత్త కోడలు మొదటి సారి సారె  తెచ్చింది అంట :).. ఇది మొదటి సారి నేను తీసుకోవడం.. ఒక గుంపులో ఆడావాళ్ళు అందంగా తయారు అయ్యి, డబ్బాలు, పళ్ళాలు, బుట్టలు, అరటి పళ్ళు, తమలపాకులు, వక్కపొడి, పసుపు కుంకుమ సున్ని పిండి పోసుకుని వచ్చి మనం మన ఇంట్లోంచి తెచ్చుకున్న పళ్ళెంలో పెట్టి కొత్త పెళ్ళికూతురి విశేషాలు చెప్పి వెళ్తారు.  ఈ పద్ధతి నాకు భలే నచ్చింది... తమ ఇంటికి కొత్త కోడలు పిల్ల వచ్చింది అని మన నోరు తీపి చేసి వెళ్తారు అన్నమాట.

ఇప్పుడు మా ఇళ్ళల్లో పెళ్లి జరిగింది అంటే అన్ని కలిపి ఒక మంచి ఖరీదైన బహుమతి తో పాటు పెళ్లిలోనో, engagement లోనో, వ్రతం అప్పుడో చేతిలో పెట్టేస్తున్నారు.. ఆ బహుమతులు చూస్తె మతి పోతుంది ఒక్కోసారి.. మొన్నామధ్య ఒకావిడ అందరికి పట్టు చీరలు పెట్టింది, వెండి గిన్నెలు, ప్రమిదలు, దేవుడి విగ్రహాలు, నగలు,... నాకు ఇంచు మించు గుండె ఆగినంత పని అయ్యింది.. నా పెళ్ళికి నాకోసం మా ఇంట్లో వాళ్ళు కూడా కొనలేదు ఆవిడ పంచిపెట్టినంత... పెళ్లి అంటే ఆర్భాటం, ఆళ్ళు పెట్టారు అంతకంటే ఎక్కువ పెట్టాలి...దుబార, బడాయి.. ఆకలిగా ఉన్న వాడికి అన్నం పెట్టారు కాని తింటే అరిగించుకోలేని వాడికి పంచభక్ష్యాలు... 

PS:  The betel leaves were snatched away by the kid before I could take the snap, so they are missing.. loved the simplicity and it was refreshing.

3 comments:

  1. you mean betel leaves?(in the PS)

    ReplyDelete
  2. Memu ee kottha kodali saareni Yaarnaala saare antaamu :) ee saari vacchinappudu pic theesi pedathaa..

    ReplyDelete