Tuesday, June 14, 2011

Day 163 ~ June 12 - Goodu

A mobile home and the householders.

అన్నీ ఉన్నా ఏదో లేదు అని బాధపడుతూనే ఉండెవాళ్ళ మధ్య ఉంటూ ఇలాంటి వాళ్ళని చూస్తె మనసుకి ఒకలాంటి స్పందన.  పగటి వేషగాళ్ళు వీళ్ళు, ఇదే వీళ్ళ ఇల్లు, ఇందులోనే వంట సామాను, ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుని వంట చేసుకుంటారు, ఏదోక అరుగు చూసుకుని నిద్రపోతారు, చెరువు గట్టున స్నానాలు గట్రా.   ఏమి లేనప్పుడు మనిషికుందే స్వేచ్చ అన్నీ ఉన్నప్పుడు ఉండదు కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మో ఇల్లు ఏమైపోతుందో, ఎలాగో ఏంటో అనుకుంటూ ఉండటం కంటే మనతో పాటే మన ఇల్లు అనుకుంటే ఎంత హాయిగా ఉంటుంది.  సెలవలు అన్నాళ్ళు బడి దెగ్గర ఉండిపోయారు అంట, బళ్ళు తెరిచే సరికి కొత్త చోటికి పయనం మొదలు.

1 comment: