Thursday, June 23, 2011

Day 174 ~ June 23 - Nested

The original nest which fell down from the tree the other day that I salvaged and stored it away.. the way make it is awesome

కొంగలు కట్టుకున్న గూళ్ళని, కాకులు గుడ్ల కోసం పడేస్తా ఉంటాయ్.. అలా పడిపోయిన ఈ గూటిని భద్రం చేశాను.. ఎంత ముచ్చటగా కొబ్బరి చీపిరి ఈనాలు, పీచు, ఆకులు, తుమ్మ ముళ్ళు, సన్న కొమ్మలు అన్ని పోగేసి ఎంత కష్టపడి ఒక్కటి ముక్కుతో ఏరి, నీటిలో ముంచి, ఒక గూడు ఏర్పాటు చేసుకుంటాయో చూస్తె భలే అనిపిస్తుంది... సాయంత్రం వచ్చి చూసుకునే పాటికి గూడు లేదు, గుడ్లు లేవు అంటే అవి ఎంత బాధపడతాయో కదా.

ఒక గూడు కూలిపోతే కలిగే బాధ నాకు బాగా అనుభవం, మనుషులకైన అంతే కదా, ఒక్కో వస్తువు ప్రేమతో కొనుక్కుని, కష్టపడి, ఇష్టపడి అన్ని చేర్చుకుని, డబ్బు పోగేసి ఇల్లు కట్టుకోవాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు ఒక ఆశనిపాతం జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తే ఆ బాధ ఎంత చేసినా తీరదేమో, పగిలిన మనసు మళ్ళీ అతకదేమో. 

1 comment:

  1. Vaatini chusi nerchukovalsindi inkoti undandi. Pakshulu, pasuvulu kuda entho kashtapadi deekshaga kattukunna goodaina, anthamayipothe akkaditho bandham tenchukuni, nirasa padakunda, malli opikaga kotha goodu kattukovatam prarambhistayi. Manishikaina anthe. Manasu gatam meeda kakunda, bhavishyathu meeda lagnam chesi, dhairyamga, santhoshamga adugu vesthe, inko andamaina goodem karma, edaina sadhinchochu.

    ReplyDelete