Really surprised to find a whole lot of cakes and greeting in our remote village.. good to see the festive spirit.
ఊరంతా ఎక్కడ పడితే అక్కడ కేకు లు అసలు ఇది మా ఊరేన అని డౌటు కూడా వచ్చేసింది :). ఊరంతా తిరిగి వచ్చాము నేను పండు :).
A photo reflection of my life, each day at a time. An amateur with no professional skill set as such in photography all set to conquer the day-to-day life giving a photo form to the TO-BE golden memories of tomorrow. A firsthand view of life of a mother in a remote village of AP, now in USA, exploring this part of the world with the kid and the OA (Other Adult). Life is the theme, not photography..నా ప్రపంచం, నా కళ్ళతో
Thursday, December 30, 2010
December 30 - Yum Yum
Mushroom burger and cheese pan pizza.. yay!! we have a cool bakery in Gdw now...
విజయవాడ దాక ఎల్లకుండానే నేను ఇవన్ని ఇప్పుడు కుమ్మేయ్యోచ్చోచ్... ఏమి లేకుండా ఊరిపోయే నాకు ఇవి తిన్నాక పరిస్తితి తలుచుకుంటే కొంచెం భయంగానే ఉంది కాని ఎప్పుడైనా ఒక సారి మరీ నాలిక పీకేస్తే తెప్పించుకుని కుమ్మేయ్యొచ్చు
Tuesday, December 28, 2010
December 29 - Animals
Farm and wild animals arranged by the kid... her toy pets which she likes naming, making sounds of and keeping with her all the time.
ఈ బుల్లి అనిమల్ గుంపు చిచ్కూ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, ఇంట్లో ఉంటే ఇంట్లోనే, బయట తిరిగితే వరండా లో, లేగవగానే డబ్బాలోంచి తీసి నిద్రపోయేదాకా అవి తన చుట్టు తను వాటి చుట్టు తిరగాలి .. నుంచోపెట్టి, ఆర్డర్ లో పెట్టి, పడేసి, దుప్పటి ఏసి, కప్పేసి .. అన్నం పెట్టి, పడుకోబెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి మొత్తం మీద బిజీ బీ కి బాగా నచ్చిన బొమ్మల్లో ఇవి ఒకటి..
ఈ బుల్లి బుల్లి బొమ్మల మీద చూసుకోకుండా ఎక్కడ కాలేసి అని పడిపోతానో అని, మళ్లీ అవి ఎక్కడైనా పోతాయేమో అని వాటిని ఒక పక్కన పెట్టి, లెక్కలు పట్టి ఈ మధ్య నా రోజు కూడా వీటి చుట్టూనే తిరుగుతుంది.
Monday, December 27, 2010
December 28 - Moolikalu, Verlu
Different types of herbs/roots
టీవిలో బోలెడన్ని కార్యక్రమాలు, త్రిఫల చూర్ణం, ఫలానా వేరు, ఫలానా మూలం, ఫలానా కాండం ఆహా, ఒహో, వాడేస్తే స్వర్గం అని చెప్పేస్తున్నారు అని ఆరోగ్య సూత్రాలలో ఎంతో మంది నిపుణులు ఎన్నో రకాలు చెప్తున్నారు.. ఇవన్ని అబ్బో ఎక్కడ దొరుకుతాయో అని పెద్ద టెన్షన్ కూడా లేదు... ఆఖరికి మా ఊరి కిరాణా కొట్లో కూడా వేలాడ కట్టేసి అమ్మేస్తున్నారు.. ఇవి వాడటం తప్పు అని నా ఉద్దేశం అసలు కాదు కాని ఏంటో చాలా కొత్తగా అనిపిస్తుంది ఇదంతా..
A close up view :).
Sunday, December 26, 2010
December 27 - Sodi Maamma
Sodi, kind of age old fortune telling where they invite the dead and function as channels of communication.
సోది చెపుతానమ్మ సోది అంటూ ఒక రకంగా పాడుకుంటూ తిరుగుతూ గుప్పెడు బియ్యం కోసం గంపెడు కబుర్లు చెప్పే ఈ ఆడవారు కూడా ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు.. బుర్ర వాయించుకుంటూ, చాటలో బియ్యం పోయించి పాటలు లాగ పాడుకుంటూ పాత చీరలు, సోలెడు బియ్యం తీసుకుని వెళ్తారు... ఊర్లో ఎవరైనా చనిపోతే దినం లోపల ఆ ఇంట్లో వాళ్ళు పిలిపించి ఆ పోయినవారి మనసులోని కోరికలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు.. అదొక నమ్మకం. నేను చెప్పించుకోలేదు కాని పండు తల్లి కాసేపు బుర్రతో ఆడుకుంది, నేను ఫోటో తీసేసుకున్నా దాచుకోవడానికి :).
Saturday, December 25, 2010
December 26 - Jyothulu
Devotees in Bhavaani Maala.. queuing up for Jyothulu
జ్యోతులు పట్టుకుని ఊరంతా దీక్ష పట్టిన భవానీలు, భక్తులు తిరుగుతూ ఊరంతా చుట్టి వస్తారు... 116 rs/- కట్టి కట్టు బట్టల మీద తడి నీళ్ళు దిమ్మరించుకుని దేవికి దణ్ణం పెట్టి జ్యోతిని చేతులో పట్టుకుని భవాని స్మరణ చేస్తూ వెళ్లి వస్తారు... ఈ జ్యోతులు అందరి జీవితాలలో వెలుగు నింపుతాయి అని నమ్ముతారు.. ఈ ఫోటోలో ఉన్న పాపకి నాలుగేళ్ళు, కాని ఏంటో ముచ్చటగా పూజలు చేస్తుంది.. మంజు ఆంటి మనవరాలు... ఆడ మగా అందారు ఈ మాల వేసుకుంటారు.. 21 రోజులు, 40 రోజులు అని.. ఆడవారు ఐతే తక్కువ మగవారు మండల దీక్ష.. దీక్ష తరవాత ఓపిక ఉన్న వాళ్ళు నడిచి దుర్గ గుడికి వెళ్లి ఇరుముడి ఇప్పేస్తారు..

walking around the village in wet clothes in the cold winter night holding the jyothis
చల్లని చలిలో అందరు చాలా భక్తితోటి ఊరి పొడుగూతా తిరుగుతారు.. ఎవరైనా మోయ్యలేకపోతే ఇంకొకరు.. తడి నీళ్ళు పోసుకుని వాళ్ళ దెగ్గర తీసుకుని మళ్లీ దేవుడి దెగ్గర ఈ జ్యోతులన్నీ పెట్టేస్తారు.
చల్లని చలిలో అందరు చాలా భక్తితోటి ఊరి పొడుగూతా తిరుగుతారు.. ఎవరైనా మోయ్యలేకపోతే ఇంకొకరు.. తడి నీళ్ళు పోసుకుని వాళ్ళ దెగ్గర తీసుకుని మళ్లీ దేవుడి దెగ్గర ఈ జ్యోతులన్నీ పెట్టేస్తారు.
The tractor carrying the God's photo following the devotees, also used to carry back the devotees who cannot walk back to the temple.
ఈ భక్తులందరి వెనకా దేవుడు నిదానంగా ట్రాక్టర్ మీద ఊరేంపు వెళ్తాడు.. దుర్గమ్మ వారి ఫోటో పెట్టి ఊరేగిస్తారు... తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా నడవలేకపోతే ఈ ట్రాక్టర్ వెనకాల కూర్చునో నుంచునో వచ్చేస్తారు.
These pictures were taken on the night of 24th.. updating today.
December 25 - Merry Christmas
Christmas at our place :) and the doll among the ornaments is my cute little angel. :).
Last year, same time... with a fresh gundu :).
Thursday, December 23, 2010
December 24 - Savaraalu
The ladies cleaning up and sorting out the fallen hair
Tying up the hair with threads
The end product
It was such a pleasure seeing them work tediously on the hair and give it a beautiful form.. after seeing the villagers recycle almost everything just began storing it up.. When he had to look out for savaram (traditional hair extension) for the recent wedding in the family, all we could manage was a synthetic fiber one, so when they turned up at home yesterday could not resist to get one done with authentic hair.
ఊరోచ్చినాక నేను చాలా నేర్చుకున్నాను, ముఖ్యంగా పొదుపు విషయంలో.. దేన్నీ కూడా వృధా పోనివ్వరు.. ఆఖరికి పాత మేకులు, ఇనుప రేకులు, ప్లాస్టిక్ విరిగిన ముక్కలు కూడా ఉల్లిపాయల వాళ్ళకి వేసేస్తారు, లేదంటే కనీసం పీచు మిటాయి అయిన కొనేసుకుంటారు.. ముందు విచిత్రంగా ఉండేది కాని ఇప్పుడు బాగా అర్థం అవుతుంది చెత్తని ఎంత తక్కువ చేసుకుంటున్నారో వాళ్ళు నేను ఎంత పేర్చేస్తున్నానో అని.. జుట్టు కూడా రాలిపోయి, దువ్వుకునేటప్పుడు ఎగిరిపోయి అటు ఇటు పడిపోయి drains కి అడ్డం పడి నానా గోల లేకుండా చక్కగా పోగు చేసి దాచేసి అమ్మేస్తారు.. చాలా కాస్ట్లీ కూడా చిక్కు వెంట్రుకలు కిలో 1000 రూపాయలు.. పది గ్రాములు 100 ఇంక ఏముంది ఎక్కడా జుట్టు కనిపించదు రోడ్ల మీద ఇళ్ళలోనూ, ఉండ చుట్టి చూరులో పొట్లం కట్టి దాచేస్తారు.... మొన్న పెళ్ళికి సవరం కొనాలి అంటే జుట్టు తో చేసింది మాకు దొరకలేదు, వీళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గరకి వెళ్ళాలి అని గుర్తు కూడా రాలేదు.. నిన్న ఇంటికొచ్చి కట్టాలా అమ్మా అని అడిగితే ఎగిరి గంతేసి కట్టించి దాచి ఉంచా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని...
It was such a pleasure seeing the tangled messy hair take such a beautiful form within just an hour.. it was a very beautiful transformation, and to me it is definitely an art-form in these rural women that is rapidly growing out of sight..

Wednesday, December 22, 2010
December 23 - Pulla Regi Pallu
First taste for the season
చిన్నప్పుడు ఐతే ఊర్లో చెట్టు ఉంటే అక్కడకి చేరిపోయి ఇంట్లో వాళ్ళని అడిగో, అడక్కుండానో చెట్టెక్కో, రాళ్ళు కొట్టి చెట్టు దులిపి తెచ్చుకునేవాళ్ళం, మా అమ్మమ్మ ఇంట్లోనే ఉండేది ఒకటి కాని పెద్దగా కాయలు పడేవి కాదు ప్లస్ అక్కడ వైపు దొడ్లో ఏమైనా పాములున్టాయ్ అని భయం .. ఇప్పుడు చెట్లు లేవు, ఆ ఉత్సాహము లేదు కాని ఈ పుల్లని రేగిపళ్ళు మాత్రం తినాలని అన్పిస్తుంది అప్పుడప్పుడు.. ఊర్లో డబ్బులకే కాక పరిగ, బియ్యం వేస్తె కూడా రేగిపళ్ళు ఇస్తారు.. చిన్నప్పుడు అమ్మమ్మ తన దెగ్గర డబ్బు లేకపోయినా వడ్లు కాని బియ్యం కాని ఒక సోలెడు పోసి ఈ పళ్ళు కొనిపెట్టేది మేము గోల చేస్తే.. ఇప్పుడంటే ఈ పెద్ద రేగిపళ్ళు వచ్చేసి కాని నాకు చాలా కాలం అసలాంటి పళ్ళు ఉంటాయి అవి కూడా రేగిపళ్ళు అని తెలియదు...
ఇప్పుడు రుచి కంటే కూడా జ్ఞాపకాల కోసం తింటాను ఈ కాయల్ని.
ఇప్పుడు రుచి కంటే కూడా జ్ఞాపకాల కోసం తింటాను ఈ కాయల్ని.
Tuesday, December 21, 2010
December 22 - Yantrudu :)
Supposed to be a robot (yantrudu) made by Yasin holding the kid's name :).. these kids I say... Love Unlimited!!
బిల్డింగ్ బ్లాక్స్ అంటే నాకు భలే సరదా ఎంచక్కా మనకి నచ్చినట్టు ఏదో చేసేసుకుని పెద్ద ఆర్కిటెక్ట్ లాగ కట్టింగ్ ఇచ్చేసుకోవచ్చు.. చిచ్కూకి ఇది తెచ్చాను కాని తనకి ఒకటే వచ్చు టవర్ కట్టడం... లేదంటే నేను/పిల్లలు కట్టే టవర్స్ మటాష్ చెయ్యడం.. వీల్ బ్లాక్స్ పట్టుకుని, కార్, లారి జూమ్ జూమ్ జూమ్ అనుకుంటూ తిప్పుకుని రావడం.. కింద పడ్డాక ఒక్కో కలర్ ఒక్కో చోట పోగు చేసి డబ్బాలో పడేయ్యటం.. తిక్క మూడ్లో ఉంటే డబ్బాలోవి పీకి ఇల్లంతా గిరాటేసి రావడం .
Monday, December 20, 2010
December 21 - Ee Reyi Challanidi
Full moon at 5:30 p.m. yesterday. the flash -less cam could not capture the beauty but still I tried (pic taken by sony cam).
నాకు వెన్నెల్లో ఇప్పుడు నేను ఉండే ఇల్లు అంటే చాలా చాలా ఇష్టం.. అంతకు ముందు కూడా ఇష్టమే కాని వెన్నెల నిజమైన అందం నేను ఆస్వాదించింది ఇక్కడే.. వెన్నెల్లో ఈ ఇంటి అందం చెప్పలేనంత ఇష్టం నాకు.. కొబ్బరి చెట్లు మీదగా పడే వెన్నెల నీడ, ఆ వెలుగులో ఆ ఇంటి నీడ పడే నేల, చల్లని గాలి, చుట్టు పక్కల నిశ్శబ్దం.. డాబా మీద నించి చూస్తె కనిపించే ఊరు, సద్దుమణిగిన తరవాత చాలా ముచ్చటగా ఉంటుంది.. ప్రతి రాత్రి పౌర్ణమి ఐతే ఎంత బాగుండు అనిపిస్తుంది.. ఇంత తీరిక, ఓపిక అవకాశం మళ్లీ ఎప్పుడు దొరుకుతుందో అని వెన్నలని అంతా తాగేయ్యాలి అనిపిస్తుస్తుంది కూడా :).
The moon at 8 p.m. could not stay out beyond that due to cold.. how I wish I had a camera to capture these lovely moments (sony cam again).. but Thank God for the lovely lens in my eyes which enables me to enjoy this spectacular beauty of nature once a month.
అసలు వెన్నల అనే కాదు నాకు వీలు కుదిరినప్పుడు ఆకాశం వైపు ఆ నక్షత్రాల వైపు, వీధి దీపాల వెలుతురులో కనిపిస్తున్న చెట్ల ఆకుల నీడల్ని, చిన్ని చిన్ని దీపాల్లాగా కనిపించే మిణుగురు పురుగుల్ని చూడటం అన్నా కూడా చాలా ఇష్టం.. గుప్పెండంతా ఆకాశాన్ని తీసుకుని గుండెల్లో దాచేసుకుని ఎప్పుడు అదే ఆనందం పొందాలి అనిపిస్తూ ఉంటుంది.. చిచ్కూ కి ఇంకా పెద్దగా తెలియదు కాని చందమామ అన్నా స్టార్స్ అన్నా భలే ఇష్టం.. చల్ల గాలి అని నేనే బయటకి తీసుకుని రాను గాని..

Sunday, December 19, 2010
December 20 - A different ball game
If you are wondering how many kids are playing at the timeof this shot... it is just the LO running around picking random balls and bats to play with or rather push around..
ఈ బాల్స్ బాట్స్ అన్నిటితోటి ఆడేది చిచ్కూ ఒకటే, ఏదో ఒక బాట్ పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు బాల్స్ తోసుకుంటూ ఒక్కటే ఆడుకుంటుంది, మూడ్ వస్తే నాకు కూడా ఒక బాట్ ఇచ్చి పరిగెట్టిస్తుంది.. పొద్దున్నే లేగవగానే, సాయంత్రం బళ్ళో పిల్లలు రాగానే ఈ బంతులన్నీ అలా బుట్టలోంచి తీసి గిరాటేసి తిరుగుతూ ఆడుకుంటుంది.. గుడ్ షాట్, 6, 4, క్యాచ్ అంటూ అరుపులు, పరుగులు కేకలు.. పొద్దున్న ఒక్కదానివి, సాయంత్రం పిల్లలందరివి వినిపిస్తూ ఉంటాయి.
A good part of the day goes in picking up, sorting, playing, running around these balls and bats.. I wish I could run around as much as she does around this tiny space.. some times i feel she walks about a mile or two just running around these balls.. kaala tika.

Saturday, December 18, 2010
December 19 - Gel Creams
Aloe and saffron gel moisturizers to battle winter dryness
చలి పులి బాబోయ్... చర్మం మొత్తం ఎవరో లాగిపట్టేసినట్టు దారుణంగా ఉంది.. చలికాలంలో ప్రతి ఏడు నేను చేసే పని ఇలాంటిదొకటి రెండు కొనడం ఒక రోజో రెండు రోజులో లేదంటే అసలు విపరీతంగా మంట పుట్టినప్పుడో మొహానికి కొంచెం రాయటం మళ్లీ వచ్చే ఏడాది దాక దాని మొహం చూడకపోవడం, అప్పుడు అవి పారేసి మళ్లీ కొత్తవి కొనడం.. ప్చ్, ప్చ్.. కాళ్ళు ఐతే అప్పుడే ఇసక సిమెంటు మోసి వచ్చినట్టు రంగు మారిపోయి... యాక్కి.. ఈ సారి ఎలాగైనా ఈ సీసాలు ఐపోగోట్టాలి... aloe చిచ్కూకి saffron నాకు... పాపం తనకి కూడా నా చర్మ తత్వమే వచ్చింది మరి :((.. dry skin. ఇది రాసాక భలే చల్లగా ఉంటుంది.. గొంతులో Halls బిళ్ళలు చప్పరించినాక నీళ్ళు తాగితే ఉంటుందే, అంత చల్లగా ఉంటుంది మొహం మీద గాలి తగిలితే.. సో మళ్లీ వూగ్లీ వూగ్లీ వూష్.. .:)).
Friday, December 17, 2010
December 18 - Chinnammagaariki Dannam Pettu..
The decorated bull performing in front of the kid...
అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలు ఐపోతున్నట్టున్నాయ్.. గంగిరెద్దు మేళం వచ్చేసింది.. ఎన్నో విన్యాసాలు చేయించి వెళ్ళాడు అతను, పోయినేడాది కూడా ఇక్కడే ఉన్నాం.. చిచ్కూ ఐతే భలే ధైర్యంగా ఎద్దుని ఎక్కేసి ఆటలు గంతులు కూడా వేసేసింది, ఇంక దిగాను అక్కడ ఉంటాను అని మారాం కూడా చేసింది కాని ఈ ఏడు ఉహ తెలుస్తుంది కదా అమ్మ ఎద్దు, తువ్వాయి అని వచ్చి నా పక్కనే నుంచుని తొంగి చూడటం మొదలెట్టింది, నిదానంగా భయం తగ్గి భలే భలే అని చెప్పింది కాని దెగ్గరికి మాత్రం వెళ్ళలేదు... ఆ అబ్బాయి బాగా ఆడించి, బోలెడంత దీవించి మనస్పూర్తిగా చిచ్కూతో ఆడుకుని, ఫోటో తీయించుకుని వెళ్ళాడు... ఇదంతా ఒక సంక్రాంతి ritual ఐపోతోంది మాకు ఇది.. ఇవన్ని ఎప్పటికి ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది, ఎంత కష్టమైనా ఇంక కొంత కాలం ఇక్కడే ఉండి ఇంకొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవాలి అనిపిస్తుంది..

Thursday, December 16, 2010
December 17 - Brunch
Brunch after work
ఈ లేట్ లేగవడం అండ్ లేట్ వర్కు మూలాన నా తిండి మళ్లీ అడ్డ దిద్దం ఐపోయింది.. ఎప్పుడో ౧౨ గంటలకి నా బ్రంచ్... ఈ రేంజి లో తింటే అదుగో ఆ గుంట పొంగడాలు లాగానే గుండ్రంగా ఉంటారు మరి..
Wednesday, December 15, 2010
December 16 - Anji Swamy
The statue of anjaneya swamy.. standing next to the main road.
ఈ విగ్రహం మా తాతయ్య నేను చిన్నప్పుడు ఎప్పుడో చేయించాడు, ఇంటి ఎదురుగా ఉన్న రామాలయానికి ఇవ్వడానికి, తరవాత ఆ గుడి మూత పడిపోయింది, విగ్రహం పని ఆగిపోయింది....అలాగ రంగులు లేకుండా, సిమెంట్ తోటి చాలా రోజులు ఉండిపోయింది ఇంటి ఎదురుగుండా.... చివారఖరికి ఎప్పుడో ఎవరో బడ్డీ కొట్టు అతను అడిగి తీసుకుని దీనికి మోక్షం ప్రసాదించాడు.. తన కొట్టు పక్కనే నిలబెట్టి.. రోడ్ పక్కనే ఉన్న తన షాప్ ని గవర్నమెంటు వాళ్ళు కూల్చేయ్యకుండా... కొంచెం బాధేసింది ఇలా ఆయన విగ్రహం వాడటం కాని అలా రంగులు లేకుండా ప్రతిష్ట లేకుండా ఉండటం కంటే ఇదే మేలు అని సరిపెట్టేసుకున్నా... చిచ్కూ కి అంజి స్వామి నాకు God మేము ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒకసారి పలకరించి వెళ్తాం.
December 15 - Cheti Pampu
The hand pump for bathing water when the municipal water is muddy and dirty green in color.
చెరువులో నీళ్ళు చెత్త చెదారం తోటి వచ్చినప్పుడు చేతి పంపు నీళ్ళు తప్పవు..
చెరువులో నీళ్ళు చెత్త చెదారం తోటి వచ్చినప్పుడు చేతి పంపు నీళ్ళు తప్పవు..
Tuesday, December 14, 2010
December 14 - Pidakala veta
Cowdung cakes used in burning clay stoves put to dry on the mud wall
ఊర్లో గోడల మీద కనిపించే పిడకలు నాకు ఉహ తెలిసినప్పటినించి చూస్తున్న కాబట్టి నాకు ఆవు అవి గోడ మీద ఎలా వేసిందా అని డౌటు రాట్లేదు :) మన బ్రహ్మి లాగ.. వరస పెట్టి వానలు పడటం వలన వీటికి విపరీతమైన కరువు వచ్చేసింది.. కర్రల పొయ్యి మీద స్నానానికి నీళ్ళు కాయటానికి నాకు పిడకలు అవసరం.. 100 పిడకలు 20 రూపాయలు ఉండేవి ఇప్పుడు 50, ఇస్తామన్నా కూడ ఎక్కడ వాళ్లకి వంట చేసుకోడానికే లేవు ఇంక నాకు నీల్లకేవరిస్తారు. కిరసనాయిలు బయట కొనాలి అంటే దొరకదు, ఎవరైనా రేషన్ మీద తెచ్చి నాకు ఇవ్వాలి, ఇప్పుడు పిడకలు కూడ ఎక్కడా లేవు సో చిచ్కూ స్నానానికి వేడి నీళ్ళ కార్యక్రమం అటక ఎక్కేసింది, హీటర్ నీళ్ళే .. చాలా రోజులు తరవాత ఇవి కనిపిస్తే అదొక ఆనందం.. ఛీ ఎదవ బ్రతుకు ఈ పిడకలు చూసి కూడ ఆనందంగా గంతులేస్తానని ఎప్పుడు అనుకోలేదు అసల.. చిచ్కూకి ఆ నీళ్ళు పోస్తే అదొక తృప్తి నాకు మరి.
Monday, December 13, 2010
December 13 - Acchangaayalu
the lady selling all types of herbs and pins and needles... she was all too happy to pose and wanted specifically to put it up on internet, i dont know how far she understood the concept of net though.
the stuff she was selling.. most of which names I dont really know.. but those nuts are called karakkaayalu.
gacchakaayalu.. the seeds used to play traditional game called acchangaayalu..
ఒక పూసలావిడ నిన్న వీధిలో వెళ్తుంటే మేము కేకేసి బోలెడన్ని కొనుక్కున్నాం... ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసిన ఎన్నో చిన్ని చిన్ని వస్తువులు ఆవిడ దెగ్గర ఉన్నాయి.. కరక్కాయలు, మాస కాయలు, గచ్చ కాయలు, దిష్టి పూసలు, చూపు పూసలు, సూదులు, వేర్లు, గింజలు, పిక్కలు, ఇలా ఎన్నో.. చిచ్కూ ఐతే పండగ చేసుకుంది అన్ని రకాలు చూసి, ఆవిడ కూడ పాపం ఏది అంటే అది ముట్టుకోనిచ్చింది.. అలాగే మంచి బేరం కూడ చేసుకుంది.. పాపమ్మ గారికి నచ్చింది కొనండి అమ్మ అని...
నేను ఎప్పుడో ఆడుకున్న అచ్చంగాయలు గుర్తొచ్చి గచ్చ కాయలు తెచ్చుకున్నాను.. ఎంతో ముచ్చటగా దాచుకున్న చిచ్కూ ఎక్కడైనా పారేయకుండా.. తను మింగదు కాని ఏదైనా సరే ఒకటి నొన్ను, బోలు.. ఎక్ ధో తీన్.. వన్, తూ అనుకుంటూ లేక్కలేసుకుని ఎక్కడో దాచేసుకుంటుంది.. .
Sunday, December 12, 2010
December 12 - Curtaining
One of the very good things about the house is the bright sunlight but I need to forcefully stop it all at least in the bedroom for the kid to have a nap during the afternoon.
ఎంచక్కా ఇంట్లోకి వచ్చే వెలుతురుని బలవంతంగా కర్టెన్ వేసి ఆపాల్సి వస్తుంది చిచ్కూ నిద్ర కోసం..... నిన్నంతా ఊరు మీద పడి ఇల్లంతా కర్టెన్లు కుట్టించడం, సరుకులు తెచ్చుకోవడం సరిపోయింది.. ఇవ్వాళ అవి తగిలించడం.

Saturday, December 11, 2010
December 11 - Chinnanna Birthday
Kid waiting for the cake to be cut.. actually they both cut it.. looks like it is in the genes "hum cake khaanekeliye kahin bhi pahun jaate hai ;)"
యాసిన్ అన్న పుట్టిన రోజుకి చిచ్కూ గారు చీఫ్ గెస్టు.. ఆవిడే కేకు కోశారు, కొంచెం తిన్నారు కూడ.. వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడే కాసేపు గంతులేసి వచ్చాము..
Friday, December 10, 2010
December 10 - Cycle shop
getting the balls filled with air.
పిల్ల సచిన్ లాగ ఎప్పుడు ఒక బ్యాటు పుచ్చుకుని దొడ్లో ఉన్న బాల్స్ అన్నిటిని అటు ఇటు తోసుకుని తిరుగుతూ ఉంటుంది చిచ్కూ... మధ్యలో కాకులు తెచ్చి వేసిన ముల్లుల వల్లో లేకపోతె పిల్లలు గెట్టిగా ఎత్తి కొట్టేస్తోనో గాలి పోవడం, పేలిపోవడం జరుగుతూ ఉంటే.. అప్పుడు అన్ని లెక్క చూసుకుని ఏదైనా తగ్గితే ఇంక ఇంట్లో గోల గోల.. అందుకే ఒకటి పొతే ఇంకోటి రెడీ పెట్టుకుంటా... పొద్దున్నే లేచి వెళ్లి వాళ్ళ ప్రాణాలు తీసి గాలి కొట్టించుకుని ఒక స్మైల్ ఇచ్చేసి వచ్చేస్తాం :).
Thursday, December 9, 2010
December 9 - Floating Flowers
The arrangement near the work table.. a small gift for myself.
నాకు ఉన్నవి చిన్ని చిన్ని కోరికలు కొన్ని వాటి కోసం డబ్బు దాచి, పెద్ద ఖరీదు అయినవి కాదు కాని అదొక ముచ్చట, ఏదైనా పని చేస్తే అది మానేసి, దాచిన డబ్బుతో కొంటె అదొక తృప్తి.. అప్పుడప్పుడు నాకు నేను ఈ బుల్లి బహుమతులు ఇచ్చుకుంటే అదొక తుత్తి.
December 8 - Kottaa.. Paatha
I finally get a Nikon basic model sleek camera for regular pictures to assist at nighttime...
కొత్త కెమెరా ఒకటి కొనేసాను ఆఖరికి... SLR కొనాలి అంటే అది మనకి అందే రేంజ్ లో లేదు.. మొత్తం మీద నాకు నచ్చింది కొనాలి అంటే చిరిగి చాటంత అయ్యింది దెగ్గర దెగ్గర 60K అన్నాడు.. కాసేపు దాని వేపు చూసుకుని, నోట్లో నోట్లో సొల్లు కార్చేసుకుని.. ఉసూరు మంటూ ఒకటి తెచ్చుకున్న.. ఈసారి పెద్ద budget కొనేస్తే మళ్లీ నా SLR కోరిక మూల పడిపోతుంది అని, అయినా నేను తీసే ఇంతోటి బొమ్మలకి ఇప్పుడే అంత కావాలా అని, ఒక రకంగా ఈ బ్లాగ్ కోసమే కొన్నాను దీన్ని.. ఈ ఊరునించి వెళ్ళేలోపు అన్ని జ్ఞాపకాలు దాచుకోవడానికి.. ఒక వాచీ కూడ ఫ్రీ గా ఇచ్చాడు నికోన్ వాడు... సో ఇది నా పాత కెమెరా తో తీసిన కొత్త దాని ఫోటో అన్నమాట. నాకు పెద్దగా నచ్చలేదు.. అదేదో చెప్పినట్లు రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తె మొట్టబుద్ది అయ్యింది అంట.. అలా ఉంది నా పరిస్తితి.. కాని చక్కగా అరిచేతిలో ఇమిడి పోయేలాగా ఉంది బుజ్జిది..
ఇది నామొదటి కెమెరా, నా కష్టార్జితంతో కొన్నది, ఎంతో ఆలోచించి నా ఫ్రెండ్ తోటి అమెరికా నించి తెప్పించుకున్నది, నా బడ్జెట్ కి... చిచ్కూ గాడిని ఇప్పటిదాకా ఫోటోల్లోకి దింపింది ఈ బుజ్జిదే, ఎన్నో జ్ఞాపకాలను, మరిచిపోకుండా ఈ బుజ్జిది తనలో దాచుకుని నాకు ఇచ్చింది.. అందుకే ఇదంటే నాకు చెప్పలేని ప్రేమ.. ఎంత పాడైపోయినా, ఎంత blur ఇమేజెస్ వచ్చినా దీన్నే అంటిపెట్టుకుని ఉన్న.. ఫ్లాష్ పోయింది అని కొత్తది వేయిస్తే 4వేలు అయ్యి మళ్లీ వారానికి కొత్త ఫ్లాష్ కూడ పోయింది, గారంటీ కూడా లేదు.. ఎవరికి చెప్పుకోలేక కుయ్యో మొర్రో అని అలాగే దాచేసా... I Love you my sweetheart.. you will be there with me forever and ever, you kept the memory of Sreya's first moments alive forever for her to see later..
ఒక రేంజ్ లో సెంటి అయిపోయా కదా :((.. బాయ్ బంగారం రెస్ట్ తీసుకో చక్కగా.. అప్పుడప్పుడు నేను వచ్చి చూస్తా, మంచి వెలుతురులో బోలెడు ఫోటోలు తీస్తా.
December 7 - Lunch Time
Lunchtime for school kids as part of sarva siksha abhiyaan... the kid squatting with them.
మధ్యాన్న భోజన పధకం కింద బడిలో పిల్లలకి రోజు అన్నం పెడతారు.. అప్పుడప్పుడు నేను చిచ్కూ వెళ్లి వాళ్ళతో కూర్చుని వస్తాము.. మరీ చిన్నప్పుడు తన farex కూడ వాళ్ళు తినేటప్పుడు వాళ్ళని చూపిస్తూ కబుర్లు చెప్తూ పెట్టేవాళ్ళం.. ఇప్పుడు ఇల్లు మారాక కొంచెం దూరం అయ్యి వాళ్ళు తినేసాక వచ్చి చిచ్కూ తినేదాక ఆడుకుని వెళ్తారు. ఒక్కోసారి వాళ్ళు ప్రేమతో మొదటి ముద్ద శ్రేయమ్మకి అని పెట్టేస్తారు.. ఈవిడగారు పరమానందంగా తినేస్తారు... అందుకే అంటారు కదా పిల్లల మనసులు కల్లా కపటం ఎరుగవు అని.
Sunday, December 5, 2010
December 6 - Gandham Saana
Traditional way of making sandal paste on a specific stone designated for it.
ఈ రోజుల్లో గంధం సాన అనేది ఎక్కడో కాని కనిపించట్లేదు.. గంధం పొడి అంటే షాప్లో దొరికే పొడిలో నీళ్ళు కలిపెయ్యడమే.. కాని ఆ పరిమళం రాదు.. అప్పుడే అరగదీసి రాసుకుంటే ఆ చల్లదనం చెప్పలేనంత హాయిగా ఉంటుంది, వాసన అమోఘంగా ఉంటుంది.. సాన ఉండటం ఒక ఎత్తు ఐతే మంచి చెక్క దొరకటం ఇంకో ఎత్తు... ఎక్కడైనా కూర్పులు వస్తే క్రీం బదులు ఇది రాసుకుంటే చాలా హాయిగా ఉండి, తొందరగా తగ్గిపోతుంది అని నా నమ్మకం.. ఇప్పుడు నాకోసం కాకపోయినా చిచ్కూ కోసం ఎక్కువ వాడుతున్నా.
December 5 - Chilakala Gumpu
A group of parrots screeching away to glory, flying up and down fluttering this wings.. a happy bird watching for the kid and me for an hour or so.
ఎక్కడ నించి వచ్చాయో తెలియదు.. రోజు ఒకటో రెండో వచ్చే ఈ చిలకలు ఒక పెద్ద గుంపుగా వచ్చి ఇంటి దెగ్గర కరెంటు తీగల మీద చేరి ఒకటే ఆటలు, అరుపులు, అటు ఇటు ఎగరడాలు.. పచ్చగా, ముద్దుగా.. చాలా రోజుల తరవాత చూసనేమో చాలా బాగా అనిపించింది.. వాతావరణం చాలా బాగుంది.. చల్ల చల్లగా.. మధ్యాన్నం ఒంటి గంటకి చక్కగా అప్పుడే తెల్లారినట్లు భలేగా ఉండింది.

Saturday, December 4, 2010
December 4 - Watching Keenly
Watching the Big Cat Dairies, her favorite show on Animal Planet
చోటా భీమ కాకుండా చిచ్కూకి నచ్చే ఇంకో షో బిగ్ క్యాట్ షో.. ఏదైనా జంతువులు ఉంటే చాలు అవి ఏంటో చెప్తూ వాటిని చూస్తూ ఉండటం తనకి ఇష్టం. పిల్లి, పులి, సింహం, ఏదైనా క్యాట్టు, బిగ్గు క్యాట్టు... పక్షులు ఎవైన చిన్న మెడ ఉంటే కాకి, చిక్క(చిలక).. పొడుగు మేడ ఉంటే కొంగ.. హిప్పో, రినో, పాండా, తువ్వాయి (గేద, ఆవు, దున్నపోతు, దూడలు), కిచ్చు మంకీ (అన్ని రకాల కోతులు).. ఏనుగు.. నడిచే పక్షులు ఏదైనా సరే కోడి... ఈ మధ్య వాటిలాగ పాకడం గట్రా కూడ చేస్తున్నారు అమ్మాయి గారు. కూతలు కేకలు కూడాను.. ఏది పాకితే అది పాము.. క్లే డో తోటి బాములు కూడ చేస్తున్నారు ... సాయంత్రం ఐపోతే చాలు బిగ్ క్యాట్ చూడాల్సిందే.. అప్పుడు గంతులేయ్యడానికి బయట దోమలు పీకుతాయి కదా మరి.
Friday, December 3, 2010
December 3 - Toy Arrangement
Once bath toys now play mates.. Kitti, Kittu, minni, duckie and Mickie lined up by the little one.. while watching Chota Bheem
కిట్టు కిట్టి రెండు పిల్లి బొమ్మలు చిచ్కూ గాడికి నేను కొన్న మొట్ట మొదటి బొమ్మలు :))... మిక్కీ, మిన్నీ, డక్కీ స్నానం చేయించేటప్పుడు నీట్లో వేసే బొమ్మలు. ఇప్పుడు చిచ్కూ పెద్దగ ఐపోయింది కాబట్టి అవి బాత్ టాయ్స్ కాదు అంట.. ఫెండు అంట, వరస పెట్టి టీవీ ముందు పేర్చుకుని అక్కడినించి ఎవరు కదిల్చినా నానా గోల చేసేస్తూ జాగ్రత్తగా కాపాడుతున్నారు చిచ్కూ గారు ఇవ్వాళ పొద్దున్న నించి.. ఎవరైనా పొరపాటున ముట్టుకున్నారో... నో అని ఒక పెద్ద అరుపు వినిపించేస్తుంది... ఎన్నాళ్ళు ఉంటాయో అక్కడ మరి చూడాలి.
By the way, that is Chota Bheem, the character which influences Chichkoo a lot as of now.. she has to see him once a day at least.. I would certainly recommend this for kids as this has good values in it.

December 2 - Courier Kashtaalu
The courier from Caps that finally reached after 10 days.. CDs that I could not get near my place...
మందులు మింగి మింగి, ఒళ్ళు పెంచి పెంచి విసుగొచ్చేసి ఆఖరికి యోగా బెటర్ అని నిర్ణయించేసుకుని.. చిన్న చిన్నగా మొదలు పెట్టాను, బాగానే ఉంది.. నాకు ఈ బుద్ధి అదే ధ్యానం ప్రాణాయాం చేసే మంచి బుద్ధి ఎప్పుడూ ఉండేలాగా చూడు దేవుడా!! ఈ కోరిఎర్ చెన్నై నించి మా ఊరోచ్చేపాటికి నాకు కాప్స్ కి రంగులు చూపించారు.. Professional Couriers డౌన్ డౌన్ డౌన్ డౌన్!!!!!
December 1 - baddee kottu
The roadside soda/gutka/chocolate shop
ఒకప్పుడు బడ్డీ కొట్లు అనేవారు.. అందులో అగ్గిపెట్టె దెగ్గర నించి పేపరు దాక అన్ని ఉండేవి.. ఈ రోజుల్లో ఏమున్న లేకపోయినా గుట్కాలు మాత్రం గుట్టలు గుట్టలుగా అమ్ముతారు.. ఇంట్లో తయారు చేసిన సోడాలు, డ్రింకులు, బాదం పాలు, మజ్జిగా కూడ అమ్మేస్తున్నారు ప్లాస్టిక్ గ్లాసుల్లో .
Monday, November 29, 2010
November 30 - Rock Star
The rock star checks her mobile
ఎక్కడో బొమ్మల తవ్వకాలలో బయటపడిన గిటార్ తీసుకుని ఇవ్వాళ పొద్దున్నించి ఇల్లంతా మోత మొగిన్చేస్తున్నాం.. దానికి తోడు అమ్మకూడా rockstar long t -shirt వేసింది.. ఇంక ఇల్లంతా రగడ :).
November 29 - Pilla Gantulu
Yaasin jumping on to the sun-dried mattresses
మా అమ్మ ఊరేల్తే మేము చేసే మొదటి పని ఇల్లు దులిపి, సర్ది, అన్ని కడిగేసి పెట్టెయ్యడం, తను ఉంటే మమ్మల్ని చెయ్యనివ్వదు, డస్ట్ allergy అని.. సో, పండు గాడిని యాసిన్ ఆడిస్తుంటే, నేను నాగు శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో పడిపోయాం :)...
భలే మంచి ఫోటోలు వచ్చి ఈ గంతులవి.. సాగర సంగమం సినిమాలో భంగిమ టైపు కాదులెండి, మంచివే.. కాని ఇంకా ఫొటోస్ పబ్లిక్ షేర్ కి పెట్టడం ఇష్టం లేక ఇది పెట్టాను.
November 28 - the pebble assembly
the colored stones for the fish bowl.. washed and cleaned and now used to count and make shapes..
చేపల బౌల్ లో ఉండే colored స్టోన్స్ ఈ మధ్య మా ప్లే objects .. అప్పుడప్పుడు గిరాటేసి మళ్లీ గిన్నెలోకి పోగు చేసుకోవడం, ఒక్కోటి లేక్కపెట్టుకోడం, రంగులు రాళ్ళు వేరు చెయ్యటం.. అన్ని ఒక్కటి, రెండు.. మళ్లీ ఒక్కటి రెండు.. ఎందుకంటే మాకు అంతవరకే వచ్చు.. ఎన్ని ఉన్న అవి బోల్డు.. ఒకోటి, నొన్ను, బోలు.. :).. మధ్య మధ్యలో మూడ్ ఉంటే అమ్మతో సియ రాయిన్చుకుంటాం :)... మొత్తం మీద ఇవి తినేవి కాదు అని అమ్మకి పది సార్లు చెప్పి, నోట్లో పెట్టుకోను అని నమ్మించడానికి నాకు ఇన్నాళ్ళు పట్టింది.
PS: The photo is an intentional blur with soft focus just on the kid's name.

November 27 - the morning mess
the mess we leave in the morning hours..
clay, crayons, puzzles, blocks, stacks, pens.. ఇది అని లేకుండా ఏది దొరికితే అది పీకి పడేస్తాం పొద్దున్నే ;).
November 26 - idemi chettu?
branches of the two plants, flower and fruit got mixed up so badly that you cant really figure out which yields what :).
నూరువరహాలు పూలు అంటే నాకు చాలా ఇష్టం, గుత్తులు గుత్తులుగా పూస్తూ, భలే ముచ్చటగా ఉంటాయి.. సీతాఫలం అంటే నాకు ఇష్టమైన పండు.. ఈ రెండు చెట్లు కలిసిపోయి అక్కడక్కడ పండ్లు, అక్కడక్కడ పూలు చూడటానికి భలే ఉంటాయి.

Wednesday, November 24, 2010
November 25 - Tailor shop
The local tailor shop..
dont go by the looks.. if given proper directions, they stitch the model you give to perfection at a throwaway price.
ఊర్లో బట్టలు కుట్టే కొట్టు.. పేరు కూడ భలేగా ఉంటుంది.. ప్లేబాయ్ టైలర్స్ :).. చూడటానికి ఇలా ఉన్నా ఆ దర్జీకి భలే మంచి పనితనం ఉంది.. ఏది ఎలా చెప్తే అలా చాలా బాగా కుట్టి ఇంటికి తెచ్చి మరీ ఇచ్చి వెళ్తాడు..
PS: the photos in the dimly lit areas are a blur.. flash settings are not working in the camera, so the blurred pictures.. need to buy a new one after some biiig budgeting.

November 24 - Grandhaalayam
The dailies, weekly and monthlies on the library reading table
కాలు నొప్పి కొంచెం తగ్గితే మనం ఇంట్లో ఎందుకు ఉంటాం... నిదానంగా ఈడ్చుకుంటూ, ఏడ్చుకుంటూ.. అడుగులో అడుగు వేసుకుని చిచ్కూ గాడి సైకిల్ ఆసరాగా పట్టుకుని ఆచ్చికి లైబ్రరీ కి వెళ్లాం.. కాసేపు అక్కడ అన్ని చెక్ చేసి.. అన్ని బాగున్నాయ్ అని తేల్చుకున్నాక కొన్ని పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని తిరిగి ఈసురో మంటూ ఇంటికి చేరాను.. చిచ్కూ గాడికి మాత్రం పండగే.. చాలా రోజుల తరవాత బయటికి వెళ్ళడం.
the golden oldies reading the newspaper in the library sit-out area.
Subscribe to:
Posts (Atom)