Friday, December 17, 2010

December 18 - Chinnammagaariki Dannam Pettu..

The decorated bull performing in front of the kid...

అప్పుడే సంక్రాంతి సంబరాలు మొదలు ఐపోతున్నట్టున్నాయ్.. గంగిరెద్దు మేళం వచ్చేసింది.. ఎన్నో విన్యాసాలు చేయించి వెళ్ళాడు అతను, పోయినేడాది కూడా ఇక్కడే ఉన్నాం.. చిచ్కూ ఐతే భలే ధైర్యంగా ఎద్దుని ఎక్కేసి ఆటలు గంతులు కూడా వేసేసింది, ఇంక దిగాను అక్కడ ఉంటాను అని మారాం కూడా చేసింది కాని ఈ ఏడు ఉహ తెలుస్తుంది కదా అమ్మ ఎద్దు, తువ్వాయి అని వచ్చి నా పక్కనే నుంచుని తొంగి చూడటం మొదలెట్టింది, నిదానంగా భయం తగ్గి భలే భలే అని చెప్పింది కాని దెగ్గరికి మాత్రం వెళ్ళలేదు... ఆ అబ్బాయి బాగా ఆడించి, బోలెడంత దీవించి మనస్పూర్తిగా చిచ్కూతో ఆడుకుని, ఫోటో తీయించుకుని వెళ్ళాడు... ఇదంతా ఒక సంక్రాంతి ritual ఐపోతోంది మాకు ఇది..   ఇవన్ని ఎప్పటికి ఇలాగే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది, ఎంత కష్టమైనా ఇంక కొంత కాలం ఇక్కడే ఉండి ఇంకొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవాలి అనిపిస్తుంది..

Last year around the same time

No comments:

Post a Comment