Tuesday, December 14, 2010

December 14 - Pidakala veta

Cowdung cakes used in burning clay stoves put to dry on the mud wall

ఊర్లో గోడల మీద కనిపించే పిడకలు నాకు ఉహ తెలిసినప్పటినించి చూస్తున్న కాబట్టి నాకు ఆవు అవి గోడ మీద ఎలా వేసిందా అని డౌటు రాట్లేదు :) మన బ్రహ్మి లాగ.. వరస పెట్టి వానలు పడటం వలన వీటికి విపరీతమైన కరువు వచ్చేసింది.. కర్రల పొయ్యి మీద స్నానానికి నీళ్ళు కాయటానికి నాకు పిడకలు అవసరం.. 100 పిడకలు 20 రూపాయలు ఉండేవి ఇప్పుడు 50, ఇస్తామన్నా కూడ ఎక్కడ వాళ్లకి వంట చేసుకోడానికే లేవు ఇంక నాకు నీల్లకేవరిస్తారు. కిరసనాయిలు బయట కొనాలి అంటే దొరకదు, ఎవరైనా రేషన్ మీద తెచ్చి నాకు ఇవ్వాలి, ఇప్పుడు పిడకలు కూడ ఎక్కడా లేవు సో చిచ్కూ స్నానానికి వేడి నీళ్ళ కార్యక్రమం అటక ఎక్కేసింది, హీటర్ నీళ్ళే .. చాలా రోజులు తరవాత ఇవి కనిపిస్తే అదొక ఆనందం.. ఛీ ఎదవ బ్రతుకు ఈ పిడకలు చూసి కూడ ఆనందంగా గంతులేస్తానని ఎప్పుడు అనుకోలేదు అసల.. చిచ్కూకి ఆ నీళ్ళు పోస్తే అదొక తృప్తి నాకు మరి.

3 comments:

  1. ఈ అవిడియా ఏదో బాగుందే. చిన్నప్పుడు మా అమ్మ నీళ్ళు కాయడానికి కట్టెలతో పాటుగా చిన్న పిడక ముక్క వాడేది. కానీ ఇలా పూర్తిగా పిడకలతోనే నీళ్ళు కాచుకోవటం, వంట చేసుకోవటం చెయ్యొచ్చని నాకు తెలియదు.. గ్లోబల్ వార్మింగ్ గురించి బాధ పడే నాలాంటి వాళ్లకి దేవుడిచ్చిన గొప్ప వరం అన్నమాట. భవిష్యత్తులో గ్యాస్ మొత్తం అయిపోయినా, ఎంచక్కా ఒక గేదె/ఆవు ని కొనుక్కొని, దాన్ని పెంచుకొని, దాని చేత బోల్డు బోల్డు పేడ వేయిన్చేసుకొని, మనం వంటలు అన్నీ వాటి పిడకలతో వండేసుకోవచ్చు అన్నమాట. :-)

    ReplyDelete
  2. gobar gas ani oka concept already undi babu.. kaani boledu place undaali.. yeah konni karralu, pullalu, kobbari mattalu, kobbari doppalu gatra kooda vestaaru.. sologaa pidakalatoti ante chetulu padipotay vaallaki chesi chesi :)...

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete