Saturday, December 25, 2010

December 26 - Jyothulu

Devotees in Bhavaani Maala.. queuing up for Jyothulu

 జ్యోతులు పట్టుకుని ఊరంతా దీక్ష పట్టిన భవానీలు, భక్తులు తిరుగుతూ ఊరంతా చుట్టి వస్తారు... 116 rs/-  కట్టి కట్టు బట్టల మీద తడి నీళ్ళు దిమ్మరించుకుని దేవికి దణ్ణం పెట్టి జ్యోతిని చేతులో పట్టుకుని భవాని స్మరణ చేస్తూ వెళ్లి వస్తారు... ఈ జ్యోతులు అందరి జీవితాలలో వెలుగు నింపుతాయి అని నమ్ముతారు..  ఈ ఫోటోలో ఉన్న పాపకి నాలుగేళ్ళు, కాని ఏంటో ముచ్చటగా పూజలు చేస్తుంది.. మంజు ఆంటి మనవరాలు... ఆడ మగా అందారు ఈ మాల వేసుకుంటారు.. 21 రోజులు, 40 రోజులు అని.. ఆడవారు ఐతే తక్కువ మగవారు మండల దీక్ష.. దీక్ష తరవాత ఓపిక ఉన్న వాళ్ళు నడిచి దుర్గ గుడికి వెళ్లి ఇరుముడి ఇప్పేస్తారు..

walking around the village in wet clothes in the cold winter night holding the jyothis
చల్లని చలిలో అందరు చాలా భక్తితోటి ఊరి పొడుగూతా తిరుగుతారు.. ఎవరైనా మోయ్యలేకపోతే ఇంకొకరు.. తడి నీళ్ళు పోసుకుని వాళ్ళ దెగ్గర తీసుకుని మళ్లీ దేవుడి దెగ్గర ఈ జ్యోతులన్నీ పెట్టేస్తారు.


The tractor carrying the God's photo following the devotees, also used to carry back the devotees who cannot walk back to the temple.

ఈ భక్తులందరి వెనకా దేవుడు నిదానంగా ట్రాక్టర్ మీద ఊరేంపు వెళ్తాడు.. దుర్గమ్మ వారి ఫోటో పెట్టి ఊరేగిస్తారు... తిరిగి వచ్చేటప్పుడు ఎవరైనా నడవలేకపోతే ఈ ట్రాక్టర్ వెనకాల కూర్చునో నుంచునో వచ్చేస్తారు. 

These pictures were taken on the night of 24th.. updating today.

No comments:

Post a Comment