Wednesday, December 22, 2010

December 23 - Pulla Regi Pallu

First taste for the season

చిన్నప్పుడు ఐతే ఊర్లో చెట్టు ఉంటే అక్కడకి చేరిపోయి ఇంట్లో వాళ్ళని అడిగో, అడక్కుండానో చెట్టెక్కో, రాళ్ళు కొట్టి చెట్టు దులిపి తెచ్చుకునేవాళ్ళం, మా అమ్మమ్మ ఇంట్లోనే ఉండేది ఒకటి కాని పెద్దగా కాయలు పడేవి కాదు ప్లస్ అక్కడ వైపు దొడ్లో ఏమైనా పాములున్టాయ్ అని భయం  .. ఇప్పుడు చెట్లు లేవు, ఆ ఉత్సాహము లేదు కాని ఈ పుల్లని రేగిపళ్ళు మాత్రం తినాలని అన్పిస్తుంది అప్పుడప్పుడు.. ఊర్లో డబ్బులకే కాక పరిగ, బియ్యం వేస్తె కూడా రేగిపళ్ళు ఇస్తారు.. చిన్నప్పుడు అమ్మమ్మ తన దెగ్గర డబ్బు లేకపోయినా వడ్లు కాని బియ్యం కాని ఒక సోలెడు పోసి ఈ పళ్ళు కొనిపెట్టేది మేము గోల చేస్తే.. ఇప్పుడంటే ఈ పెద్ద రేగిపళ్ళు వచ్చేసి కాని నాకు చాలా కాలం అసలాంటి పళ్ళు ఉంటాయి అవి కూడా రేగిపళ్ళు అని తెలియదు...

ఇప్పుడు రుచి కంటే కూడా జ్ఞాపకాల కోసం తింటాను ఈ కాయల్ని.

3 comments:

  1. nijanga chinnappati gnapakalu kallaku kattinattu gurthosthunnayi..thanks

    ReplyDelete
  2. Nenu kooda pedda regipalla fan ni. I study in delhi. Regipallu or regi vadalu pack chesi pampinche vaallu evaraina untara? If u know them please tell me the address

    ReplyDelete
  3. Nenu kooda pedda regipalla fan ni. Evaraina repallu or regi vadalu thayaaru chesi, pack chesi pampinchevallu unte valla address ivvandi please....

    ReplyDelete