Sunday, December 26, 2010

December 27 - Sodi Maamma

Sodi, kind of age old fortune telling where they invite the dead and function as channels of communication.

సోది చెపుతానమ్మ సోది అంటూ ఒక రకంగా పాడుకుంటూ తిరుగుతూ గుప్పెడు బియ్యం కోసం గంపెడు కబుర్లు చెప్పే ఈ ఆడవారు కూడా ఇప్పుడు పెద్దగా కనిపించట్లేదు.. బుర్ర వాయించుకుంటూ, చాటలో బియ్యం పోయించి పాటలు లాగ పాడుకుంటూ పాత చీరలు, సోలెడు బియ్యం తీసుకుని వెళ్తారు... ఊర్లో ఎవరైనా చనిపోతే దినం లోపల ఆ ఇంట్లో వాళ్ళు పిలిపించి ఆ పోయినవారి మనసులోని కోరికలు ఏమైనా ఉంటే తెలుసుకుంటారు.. అదొక నమ్మకం.   నేను చెప్పించుకోలేదు కాని పండు తల్లి కాసేపు బుర్రతో ఆడుకుంది, నేను ఫోటో తీసేసుకున్నా దాచుకోవడానికి :). 

3 comments:

  1. ఆమె చేతిలో ఉన్నదాన్ని బూర అంటారనుకుంటా, బుర్ర కాదు. కానీ వాయించేది మాత్రం బుర్రనే (అంటే మన తల కాయనే). పాపం రోజు గడవటం కోసం ఈ వయసులో ఇలా ఇంటింటికీ తిరిగి ఎంత కష్టపడుతున్నది..

    ReplyDelete
  2. oorlo etu choosinaa ee vayasu vaare untaaru rajesh... naaku chaala motivation veellani chooste.. aakharidaaka vaalla onti balam meede bratukutaaru.

    ReplyDelete