Swinging high and swinging low
It has been raining real bad these past couple of days, hence posting the pictures from my old archives.
అట్ల తద్ది రోజు ఉయ్యాలలు ఊగటం చాలా బాగుంటుంది.. తెల్లవారు ఝాము తలంట్లు, నోములు, వాయనాలు, వంటలు, వగైరా వేరే వాళ్లకి వదిలేసి ఉయ్యాల ఊగటం, అట్లు తినడం మాత్రం చేస్తే అసలు ఆ పండగ నా దృష్టిలో ;). పోయినేడాది మా అమ్మమ్మ వాళ్ళ దొడ్లో ప్రత్యేకంగా పండు గాడితోటి ఆడుకోటానికి వచ్చే బడి పిల్లల కోసం కట్టించాడు మామయ్య దీన్ని.. పిల్లలు వెళ్ళాక ఖాళి ఉన్నప్పుడు పక్కింటి శీను పద్మ ఆంటి (నన్ను పెంచారు చిన్నప్పుడు, ఇప్పుడు పండు గాడిని).. నాకు వీళ్ళంటే చాలా ఇష్టం ఇప్పటికి కొత్త జంటలాగా చాలా అన్యోన్యంగా ఉంటారు.