Saturday, October 9, 2010

October 8 - Gaajula Purugulu

millipedes on the wall

Thanks to constant raining, in fact daily for the past 4 months the walls have turned green with layers of green growth.. the millipedes on the wall are a common sight in the village during the rainy season, seen everywhere, anywhere and in groups..hundreds or thousands even.. walking becomes a mess with them crawling around.. scores of them die under feet.. my daughter likes to crush them :(((((((((((((((( because they turn into a coil when touched and she thinks they are something to eat and play with!!

వానా కాలం వచ్చింది అంటే ఊర్లో మొదలయ్యేది గాజుల పురుగుల గోల.. వందలు వేలు ఇంకా చెప్పాలంటే లక్షల సంఖ్యలో వచ్చి చేరి పోతూ ఉంటాయ్, ఎక్కడ కొంచెం తడి ఉంటె అక్కడే వాటి నివాసం, నడిచేటప్పుడు కాళ్ళకి అడ్డం, మంచి నీళ్ళ బిందె దెగ్గర చెమ్మ కోసం వాటి స్థిర నివాసం.. ముట్టుకోగానే గుండ్రంగా ఉండ చుట్టుకుని పోతాయి.. అది చూసి నా కూతురు వాటి చుట్టు పరుగెత్తి వాటిని కర్రతోటి ఆపి ముడుచున్నాక తీసుకుని చేత్తో పిసకడం.. ఎక్కడ అలాంటి కార్యక్రమాలు చేస్తుందో అని నేను తన చుట్టు పరుగెత్తడం ఇదండీ ఈ వానల కాలంలో మా దినచర్య.. వానలు పడి పడి పాచి అంగుళం మందాన పట్టిపోయింది గోడలకి.. ఎంచక్కా అక్కడ కూడా కాపురం పెట్టేశాయి మన పురుగు రాజాలు :).

1 comment:

  1. మీ ఫొటోస్ చూస్తుంటే నాకు కూడా నా చిన్నప్పటి గ్నాపకాలు గుర్తొస్తుంటాయి..నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం లాంటి గ్నాపకాలు లేకపోయినా, మా ఇల్లే అల ఉండేది విజయవాడ లో. ఫూరిల్లు, కుంపటి వంటలు, రామనవమి అప్పుడు పంచిపెట్టే విసనకర్రల కోసం పోట్లాటలు, సంక్రాంతి ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు, పేరంటాలు, బొమ్మల కొలువులు, ఇంటికి వచ్చే గంగిరెద్దులు, అట్లతద్ది కి పక్క ఇంటి వాళ్ళు ఇచ్చే గొరింటాకు రుబ్బి పెట్టుకొని మా ఇంట్లో నారింజ చెట్టు కి ఉయ్యాల వేసుకొని ఊగటం, ఉండ్రాళ్ళ తద్ది కి పొద్దున్నే లేచి పెరుగన్నం తినటం, మా ఇంట్లొ పూసిన విరజాజులు పక్కవారికి ఇచ్చి వాళ్ళ ఇంట్లొ పూసిన గుండు మల్లెలు తెచ్చుకోవటం, ఇంటి నిండా పూల చెట్లు అందులొంచి అప్పుడప్పుడు పాములు :( గాజు పురుగులు.. గొంగళిలు.. భయమేస్తే సాయీబాబ విభూది… దిష్టి కొడితే జండా చెట్టు దగ్గర బాబా తాయత్తులు…. ఎండాకాలం లో పూల జడలు……ముఖ్యం గా పిల్లలు పుట్టి నప్పటి నుంచి ఒక ఏడాది వరకు పేరంటాలు… ఉ ఊ లకి ఉగ్గు గిన్నెలు, బోర్ల పడితే బొబ్బట్లు పంచటం… గుమ్మం దాటితే గారెలు, ….అడుగులకి అరిసలు… పలుకులకి పంచదార చిలకలు.. ఇలా అన్నింటికి పిలిచి పండగ చేసుకొవటం.. ఇవన్ని తియ్యటి గ్నాపకాలు… ఇప్పుడు కనపడని, మనం కూడా చెయ్యని ముచ్చట్లు… unfortunate

    ReplyDelete