The most serene baba temple I have been to to-date . a must visit place if you appen to be in Krishna district.
అంగలూరు లో ఉన్న బాబా గుడి అంటే నాకు చాలా చాలా ఇష్టం, ఆ వాతావరణం, ఆ విగ్రహం, ఆ చోటు, ఆ శుభ్రత, అన్నిటికి మించి అక్కడ ఇంకా వేరే దేవాలయాలకి పట్టినట్టు దేవాదాయ శాఖ చీడ పట్టలేదు. లంచాలు, అడ్డ దారులు ఇంకా లేవు. ఒక కుటుంబంలోని సభ్యులంతా కలిసి నిర్మాణం చేసి నడిపిస్తున్న ఒక మంచి ఆలయం. గుడికెళ్ళి దేవుడికి మనసార దణ్ణం పెట్టుకోవాలి అంటే ఇలాంటి చోటికే వెళ్ళాలి. ఇక్కడ ఫొటోస్ not allowed. నేను గుడి బయట నించి చాలా దూరం జూమ్ చేసి తీసిన పిక్చర్ ఇది. ఎక్కువ మాటలు ఉండవు, అరుపులు ఉండవు, గుడిలో ఉండే నిర్మలత్వం చెప్పడానికి వీలు లేనంత బాగుంటుంది.
No comments:
Post a Comment